Kingdom Box Office Day 12: కింగ్డమ్ 12వ రోజు వసూళ్లు.. 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ ఫిల్మ్ కింగ్డమ్. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. జూలై 31న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైందీ చిత్రం. ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతోంది. మొదటి వారంతో పోల్చితే ఈ సినిమా 2వ వారంలో కాస్తా తక్కవ వసూళ్లను రాబడుతోంది. ఇక లాభాల్లోకి రావడంతో పాటు సినిమా నష్టాలను కూడా తప్పించుకోవాలంటే మరిన్ని రోజులు థియేటర్లలో ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో కింగ్డమ్ చిత్రం బడ్జెట్ ఎంత? 12 రోజుల వసూళ్లు ఎంత? ఇంకెంత వసూళ్లు చేస్తే నష్టాలను తప్పించుకుంటుందనే వివరాల్లోకి వెళితే..

కింగ్డమ్ చిత్రం బడ్జెట్ ఎంత?
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సత్య దేవ్, భాగ్యశ్రీ బోర్సే వంటి స్టార్స్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుధ్, టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేయడం విశేషం. దీంతో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు అన్నీ కలుపుకొని 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Kingdom Day 12 Box Office Collections Worldwide

కింగ్డమ్ ప్రీరిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్?
రిలీజ్ కు ముందు నుంచే కింగ్డమ్ చిత్రంపై కాస్తా అంచనాలు నెలకున్నాయి. ఈ క్రమంలో సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తెలుగు స్టేట్స్ లో నైజాంలో రూ.15 కోట్లు, సీడెడ్‌లో రూ.6 కోట్లు, ఆంధ్రాలో 15 కోట్ల చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ.36 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో రూ.3.5 కోట్లు, ROIలో 4 కోట్లు, ఓవర్సీస్ లో రూ.10 కోట్ల బిజినెస్ అయ్యింది. ఇలా వరల్డ్ వైడ్ గా రూ.55 కోట్ల వరకు జరిగిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. దీంతో ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్ గా రూ.56 కోట్ల షేర్, 112 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

కింగ్డమ్ 11 రోజుల వసూళ్లు..
ఓపెనింగ్ డే రూ.18 కోట్లు, 2వ రోజు రూ.8 కోట్లు, 3వ రోజు రూ.8 కోట్లు, 4వ రోజు రూ.8 కోట్లు, 5వ రోజు రూ.2 కోట్లు, 6వ రోజు రూ.2 కోట్లు, 7వ రోజు రూ.1.50 కోట్లు, 8వ రోజు రూ.1.50 కోట్లు, 9వ రోజు రూ.1 కోట్లు, 10వ రోజు రూ.1.25 కోట్లు, 11వ రోజు రూ.1.10 కోట్లు ఇండియా నెట్ వసూల్ చేసింది. దీంతో 11 రోజుల వరకు ఇండియా నెట్ 51 కోట్లకు చేరుకుంది. ఇక ఇండియా గ్రాస్ రూ.80 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఓవర్సీస్ లో 21 కోట్లు వసూళ్లు అందుకుందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ.101 కోట్లు గ్రాస్ అందుకుంది.

12వ రోజు వసూళ్లు..
కింగ్డమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద వీకెండ్స్ లో మంచిగా పెర్ఫామ్ చేస్తోంది. ఇక వర్కింగ్ డేస్ లో వసూళ్లు భారీగా తగ్గిపోతున్నాయి. కాగా 12వ రోజు 10 శాతం మాత్రమే థియేటర్ ఆక్యుపెన్సీని దక్కించుకుంది. దీంతో సాయంత్రం 5 గంటల వరకు 50 లక్షల వరకు ఇండియా నెట్ వసూల్ చేసిందని, మిగితా ఆటల ద్వారా వచ్చే కలెక్షన్స్ తో 12వ రోజు రూ.1 కోటి ఇండియా నెట్ వసూల్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రం 47 కోట్ల నెట్ వసూల్ చేయడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X