Kingdom Day 2 Collections: కింగ్డమ్ బాక్సాఫీస్ ప్రభంజనం.. విజయ్ దేవరకొండ కలెక్షన్ల సంచలనం

టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత? తొలి రోజు ఎంత మేర కలెక్ట్ చేయవచ్చనే ట్రేడ్ అంచనాల వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీని సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర జరిగింది. కర్ణాటక రైట్స్ 3.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల రూపాయలు మేర జరిగింది. దాంతో వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 54.5 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 56 కోట్లు షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kingdom Day 2 Box Office Collections

కింగ్డమ్ సినిమా తొలి రోజు రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. నైజాంలో 5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 1.7 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 5 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 11.5 కోట్ల రూపాయలు, 19 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 13.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఫస్ట్ డే 36 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

కింగ్డమ్ సినిమా రెండో రోజున కూడా నిలకడగా, స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధించింది. ఈ చిత్రం వర్కింగ్ డే రోజున కూడా భారీ కలెక్షన్లను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, కన్నడ, తమిళ, కేరళ రాష్ట్రాల్లో డీసెంట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా 2వ రోజున ఈ చిత్రం 8.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ సినిమా 2 హీరోల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో కలిపి 7.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కన్నడ, తమిళం, మలయాళంలో కలిపి ఈ సినిమా 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఇక అమెరికాలో ఈ సినిమా 2వ రోజున 400K డాలర్లు అంటే.. 3.5 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో 1.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా 2వ రోజు ప్రపంచవ్యాప్తంగా 12 కోట్లు వసూలు చేసింది. దాంతో మొత్తంగా 2 రోజుల్లో 48 కోట్ల రూపాయలు రాబట్టంది. ఓవర్సీస్‌లో ఇతర దేశాల నుంచి కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది. దాంతో ఈ సినిమా 50 కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X