Kingdom Box Office Day 2: కింగ్డమ్‌‌ బాక్సాఫీస్ కలెక్షన్స్ .. విజయ్ దేవరకొండ మూవీకి రెండో రోజు ఎన్ని కోట్లంటే?

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కింగ్డమ్. జూలై 31న విడుదలైన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సత్యదేవ్, వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో కింగ్డమ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? రెండో రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలు కలిపి కింగ్డమ్ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

Kingdom Day 2 Expected Box Office Collections Worldwide Vijay Devarakonda Movie strong hold at GBOC

ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల మేర కింగ్డమ్ మూవీకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. దీంతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా కింగ్డమ్ మూవీకి 54.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు విలువ కట్టారు. విజయ్ దేవరకొండ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 56 కోట్ల రూపాయల షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని అనలిస్టులు విలువ నిర్దేశించారు. కింగ్డమ్ సినిమాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 700 స్క్రీన్‌లలో.. కర్ణాటకలో 450 స్క్రీన్‌లలో.. ఓవర్సీస్‌లో 450 స్క్రీన్‌లతో కలుపుకుని 2850 స్క్రీన్‌లలో రిలీజ్ చేసింది.

కింగ్డమ్ తొలి రోజు కలెక్షన్స్
కింగ్డమ్‌ ఫస్ట్ డే 36 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ కలెక్ట్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే.. నైజాంలో 4.96 కోట్ల రూపాయలు, సీడెడ్ 1.68 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 1.36 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 86 లక్షలు, వెస్ట్ గోదావరిలో 52 లక్షల రూపాయలు, గుంటూరులో 88 లక్షల రూపాయలు, కృష్ణాలో 68 లక్షల రూపాయలు, నెల్లూరులో 40 లక్షల రూపాయలు చొప్పున 11.34 కోట్ల రూపాయల షేర్.. 18.80 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 6.10 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. దాంతో కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్‌గా తొలిరోజు 19.29 కోట్ల రూపాయల షేర్ .. 35.86 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

కింగ్డమ్ రెండో రోజూ కలెక్షన్స్
కింగ్గడమ్ రెండో రోజూ వసూళ్ల సంగతి చూస్తే.. రెండో రోజు తెలుగులో 27.39 శాతం, తమిళంలో 8.44 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. రెండో రోజు విజయ్ దేవరకొండ మూవీకి ఆంధ్రా, నైజాంలలో 14 కోట్ల రూపాయలు.. కర్ణాటక + కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయలు.. ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున 19 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో రెండ్రోజుల్లో కింగ్‌డమ్ చిత్రం 62 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X