Kingdom Box Office Day 3: 50 కోట్ల క్లబ్‌లో కింగ్డమ్.. విజయ్ దేవరకొండ మూవీకి 3వ రోజు ఎన్ని కోట్లంటే?

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం కింగ్డమ్. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు నటించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీత సారథ్యం వ్యవహరించగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా పనిచేశారు. జూలై 31న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కింగ్డమ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 3వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కింగ్డమ్ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

Kingdom Day 3 Expected Box Office Collections Worldwide Vijay Devarakonda Movie cross 50 crores mark

తెలుగేతర రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల మేర కింగ్డమ్ మూవీకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. దీంతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా కింగ్డమ్ మూవీకి 54.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు విలువ కట్టారు. విజయ్ దేవరకొండ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల రూపాయల షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. కింగ్డమ్ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 2850 స్క్రీన్‌లలో రిలీజ్ చేశారు.

కింగ్డమ్ రెండు రోజుల కలెక్షన్స్
కింగ్డమ్‌ వసూళ్లు పరిశీలిస్తే.. ఇండియా వైడ్‌గా తొలిరోజు 18 కోట్ల రూపాయలు, రెండో రోజు 7.5 కోట్ల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో 26 కోట్ల రూపాయల నెట్, 34 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఓవర్సీస్‌లో మాత్రం కింగ్డమ్ మూవీ కుమ్మేస్తోంది. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాలలో కింగ్డమ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. దాంతో ఓవర్సీస్‌లో కింగ్డమ్ మూవీకి ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చాయి. దీంతో రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా కింగ్డమ్ సినిమా 48 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 7.11 కోట్ల రూపాయలు, సీడెడ్ 2.46 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 1.85 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 1.15 కోట్లు, వెస్ట్ గోదావరిలో 73 లక్షల రూపాయలు, గుంటూరులో 1.14 కోట్ల రూపాయలు, కృష్ణాలో 92 లక్షల రూపాయలు, నెల్లూరులో 56 లక్షల రూపాయలు చొప్పున 15.92 కోట్ల రూపాయల షేర్.. 27 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 6.80 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. దాంతో కింగ్డమ్ మూవీ వరల్డ్ వైడ్‌గా 25 కోట్ల రూపాయల షేర్ .. 48 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

కింగ్డమ్ మూడో రోజూ కలెక్షన్స్
కింగ్గడమ్ మూడో రోజూ వసూళ్ల సంగతి చూస్తే.. వీకెండ్ కావడంతో విజయ్ దేవరకొండ చిత్రానికి బుకింగ్స్ బాగానే జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మూడో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 31.25 శాతం, తమిళ వెర్షన్‌లో 12.74 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీంతో మూడో రోజు కింగ్డమ్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయలు, కర్ణాటక + తమిళనాడు+ కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయల చొప్పున 10 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దాంతో మూడు రోజుల్లోనే విజయ్ దేవరకొండ మూవీ 50 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటుతుందని, ఓవరాల్‌గా కింగ్డమ్ చిత్రం 58 కోట్ల వసూళ్లు అందుకుంటుందని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X