Kingdom Day 4 Collections: తెలుగు రాష్ట్రాల్లో కింగ్గమ్ వసూళ్ల హవా.. ఆంధ్రా, నైజాంలో ఎన్ని కోట్లంటే?
టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు.
ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత? తొలి రోజు ఎంత మేర కలెక్ట్ చేయవచ్చనే ట్రేడ్ అంచనాల వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీని సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా 38 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.
కింగ్డమ్ సినిమా 3 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా నిలిచింది. ఈ సినిమా మూడు రోజుల్లో 9.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం సీడెడ్‌లో 3.20 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఆంధ్రాలో 8.10 కోట్ల రూపాయలు వసూలుచేసింది. మూడు రోజుల్లో 20.5 కోట్ల షేర్, 35.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 9.25 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3.2 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 2.3 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 1.4 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 91 లక్షల రూపాయలు, గుంటూరులో 1.4 కోట్ల రూపాయలు, గుంటూరులో 1.4 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 1.15 కోట్ల రూపాయలు, నెల్లూరులో 70 లక్షల రూపాయలు వసూలు చేసింది.
విజయ్ దేవరకొండ సినిమాకు లాంగ్ వీకెండ్ కలిసి వచ్చిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయల మేర వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ చిత్రం 25 కోట్ల రూపాయల షేర్.. 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











