Kingdom Box Office Day 4: 100 కోట్ల వసూళ్ల దిశగా కింగ్డమ్ .. 4వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కిన సినిమా కింగ్డమ్. సత్యదేవ్, వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జూలై 31న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కింగ్డమ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 4వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి కింగ్డమ్ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

తెలుగేతర రాష్ట్రాలలో ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల మేర కింగ్డమ్ మూవీకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కింగ్డమ్ మూవీకి 54.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. విజయ్ దేవరకొండ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల రూపాయల షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. కింగ్డమ్ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 2850 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
కింగ్డమ్ మూడు రోజుల కలెక్షన్స్
కింగ్డమ్ వసూళ్లు పరిశీలిస్తే.. ఇండియా వైడ్‌గా తొలిరోజు 18 కోట్ల రూపాయలు, రెండో రోజు 7.5 కోట్ల రూపాయలు, 3వ రోజున 9 కోట్ల రూపాయలు చొప్పున మూడు రోజుల్లో 35 కోట్ల రూపాయల నెట్, 51 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఓవర్సీస్ కలెక్షన్స్ చూస్తే వీకెండ్ కావడంతో స్ట్రాంగ్ హోల్డ్ కనిపిస్తోంది. దీంతో అక్కడ ఇప్పటి వరకు 16 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. వీటితో కలుపుకుని కింగ్డమ్ మూవీకి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 67 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. నైజాంలో 9 కోట్ల రూపాయలు, సీడెడ్ 3 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 3 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2 కోట్లు, వెస్ట్ గోదావరిలో కోటి రూపాయలు, గుంటూరులో 2 కోట్ల రూపాయలు, కృష్ణాలో కోటి 50 లక్షల రూపాయలు, నెల్లూరులో కోటి రూపాయలు చొప్పున 20 కోట్ల రూపాయల షేర్.. 42 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడు+ కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 5 కోట్ల రూపాయల షేర్.. 13 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలాగే ఓవర్సీస్‌లో 7 కోట్ల రూపాయల షేర్.. 16 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను విజయ్ దేవరకొండ మూవీ రాబట్టింది. దాంతో కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 31 కోట్ల రూపాయల షేర్ .. 67 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
కింగ్డమ్ చిత్రం 3 రోజుల్లోనే 67 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ను రాబట్టినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కేరళలో విజయ్ దేవరకొండ మూవీ మాస్ జాతర సృష్టిస్తోంది. ఇప్పటి వరకు అక్కడ ఈ సినిమా కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు నివేదికలు వస్తున్నాయి. తద్వారా కేరళలో కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన నాన్ మలయాళీ సినిమాగా కింగ్డమ్ నిలిచింది.
కింగ్డమ్ నాలుగో రోజు కలెక్షన్స్
కింగ్డమ్ నాలుగో రోజు వసూళ్లను పరిశీలిస్తే.. వీకెండ్ ప్రభావంతో కింగ్డమ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి బుకింగ్ జరుగుతోంది. అర్బన్, పట్ణణ ప్రాంతాల్లో టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ అవుతున్నట్లు బుక్ మై షో తెలిపింది. నాలుగో రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 31 శాతం, తమిళ వెర్షన్‌లో 12 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. దీంతో ఆదివారం భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 4వ రోజు కింగ్డమ్‌కు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు, కర్ణాటక+ కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయల చొప్పున 10 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో 4 రోజుల వరకు కింగ్డమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











