Kingdom Box Office Day 5: కింగ్డమ్ 5వ రోజు కలెక్షన్స్.. భారీగా తగ్గిన వసూళ్లు.. ఎంత కలెక్ట్ అయ్యిందంటే?
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో సంయుక్తంగా నిర్మించారు. జూలై 31న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ మంచి వసూళ్లను అందుకుంది. ఇక 5వ రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ క్రమంలో కింగ్డమ్ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా మొత్తం ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ బడ్జెట్ ఎంత?
విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రంలో విజయ్ దేవరకొండ, సత్య రాజ్, హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే, టాప్ టెక్నీషియన్లు, ఇండియాలోనే అగ్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్ర వంటి వారు పని చేశారు. మరోవైపు ఈ సినిమా నిర్మాణం విషయంలోనూ ఏమాత్రం వెనకాడలేదు. దీంతో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులు కలుపుకొని ఈ చిత్రానినికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ పండితులు వెల్లడించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్ పాయింట్?
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం కావడం, జెర్సీ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అగ్ర నిర్మాణ సంస్థ, స్టార్ కాస్ట్, అనిరుధ్ సంగీతం కారణంగా సినిమాపై అంచనాలు పెరిగాయి. దీంతో భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు స్టేట్స్ లో 36 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 7.5 కోట్లు, ఓవర్సీస్ లో 10 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారు. ఇలా వరల్డ్ వైడ్ గా 54.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక కింగ్డమ్ చిత్రం లాభాల్లోకి రావాలంటే 56 కోట్ల షేర్.. వరల్డ్ వైడ్ గా 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ పండింతులు వాల్యూ కట్టారు.
4 రోజుల వసూళ్లు..
కింగ్డమ్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్ డే రూ.35 కోట్లు, 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.11 కోట్లు, 4వ రోజు రూ.10 కోట్లు కలెక్ట్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఇండియా నెట్ రూ.40.90 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.48.15 కోట్లు, ఓవర్సీస్ లో రూ.18.35 కోట్లు వసూల్ చేసింది. ఇలా 4వ రోజు వరకు వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ.66.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 4వ రోజు వరకు తెలుగు స్టేట్స్ (ఏపీ+తెలంగాణ)లో రూ.39 కోట్లు, తమిళ నాడులో రూ.3.4 కోట్లు, కర్ణాటకలో రూ.4.3 కోట్లు, కేరళలో రూ.1.15 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.1 కోటి వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ తెలిపింది.
5వ రోజు వసూళ్లు ఇలా..
విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం గురువారం జూలై 31న విడుదలైంది. ఆ నెక్ట్స్ మూడు రోజులు శుక్ర, శని, ఆదివారాల్లో బాక్సాఫీస్ వద్ద మంచిగా పెర్ఫామెన్స్ చేసింది. ఇక 5వ రోజు సోమవారం వర్కింగ్ డే కావడంతో థియేటర్ ఫుట్ ఫాల్ తగ్గిపోయింది. మార్నింగ్ షో, అఫ్టర్ నూన్ షో కలిసి ఓవరాల్ గా 16 శాతం మాత్రమే థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. దీంతో 5వ రోజు బాక్సాఫీస్ వద్ద సాయంత్రం 6 గంటల వరకు 92 లక్షల రూపాయలు వసూల్ చేసిందని సాక్ నిక్ వెల్లడించింది. ఇక మిగితా ఆటల వసూళ్లను కలుపుకొని ఇండియాలో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ముందు రోజు 7.4 కోట్ల రూపాయల ఇండియా నెట్ వసూల్ కావడం విశేషం. దీంతో 30 శాతానికి పైగా వసూళ్లు డ్రాప్ అవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











