Kingdom Day 6 Collections: కింగ్డమ్ కలెక్షన్లపై భారీ దెబ్బ.. విజయ్ దేవరకొండ మూవీ నష్టాల నుంచి బయటపడాలంటే?

టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంత? తొలి రోజు ఎంత మేర కలెక్ట్ చేయవచ్చనే ట్రేడ్ అంచనాల వివరాల్లోకి వెళితే..

Kingdom Day 6 Box Office Collections

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీని సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా 38 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

కింగ్డమ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో గత 5 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో ఈ చిత్రం 11.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 4.10 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 3.20 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.75 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 1.2 కోట్ల రూపాయలు, గంటూరులో 1.75 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 1.5 కోట్లు, నెల్లూరులో 1 కోటి రూపాయల కలెక్షన్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కింగ్డమ్ సినిమా తొలి వారాంతం వరకు పాజిటివ్‌గానే వసూళ్లు నమోదు చేసింది. సోమవారం నుంచి ఈ సినిమా తీవ్రమైన ప్రతికూలతను బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొన్నది. ఈ సినిమాపై తమిళనాడులో నిరసనలు రావడం, బ్యాన్ చేయాలంటే డిమాండ్ ఊపందుకోవడం వివాదంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సినిమాపై భారీగా ట్రోలింగ్ రావడం కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ చిత్రం 6వ రోజున తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ వద్ద భారీగా క్షిణించింది. కేవలం 20 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు కావడంతో పేలవంగా వసూళ్లు నమోదు అయ్యాయి.

ఇక ఈ చిత్రం 6వ రోజున ఇండియా వైడ్‌గా 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో అంటే.. నైజాం, ఆంధ్రాలోనే 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 27 కోట్ల రూపాయల షేర్, 45 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 10 కోట్ల రూపాయల షేర్, 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X