Kingdom Box Office Day 6: కింగ్డమ్‌కు షాకింగ్ కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మూవీ లాభాల్లోకి రావాలంటే?

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్. జూలై 31న ఈ పాన్ ఇండియా సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సత్యదేవ్, వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో కింగ్డమ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 6వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలకు అయిన వ్యయంతో కలిపి కింగ్డమ్ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

Kingdom Day 6 Expected Box Office Collections Worldwide Vijay Devarakonda Movie s numbers has seen a decline

ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో విషయానికి వస్తే .. కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల మేర కింగ్డమ్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కింగ్డమ్ మూవీకి 54.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. విజయ్ దేవరకొండ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల రూపాయల షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. కింగ్డమ్ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో వరల్డ్ వైడ్‌గా 2850 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కింగ్డమ్ 5 రోజుల కలెక్షన్స్
కింగ్డమ్‌ వసూళ్లు పరిశీలిస్తే.. ఇండియా వైడ్‌గా తొలిరోజు 18 కోట్ల రూపాయలు, రెండో రోజు 8 కోట్ల రూపాయలు, 3వ రోజున 8 కోట్ల రూపాయలు, 4వ రోజున 8 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు ఆర్జించింది. దాంతో కలుపుకుని ఇండియా వైడ్‌గా కింగ్డమ్ చిత్రం 44 కోట్ల రూపాయల నెట్.. 72 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ చూస్తే అక్కడ వీకెండ్ వరకు మంచి హోల్డ్ చూపించిన కింగ్డమ్ చిత్రం వర్కింగ్ డేస్‌లో కాస్త డల్ అయినప్పటికీ కలెక్షన్స్ పర్లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది కింగ్డమ్. దాంతో విజయ్ దేవరకొండ చిత్రానికి 5 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల వరకు కింగ్డమ్ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలిరోజున 12 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, 3వ రోజున 5 కోట్ల రూపాయలు, 4వ రోజున 5 కోట్ల రూపాయలు, 5వ రోజున కోటి రూపాయలు వచ్చింది. దాంతో ఐదు రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ చిత్రానికి 26 కోట్ల రూపాయల షేర్ .. 44 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కింగ్డమ్ వసూళ్లు చూస్తే.. నైజాంలో 11 కోట్ల రూపాయలు, సీడెడ్ 4 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 2 కోట్ల రూపాయలు, కృష్ణాలో 2 కోట్ల రూపాయలు, నెల్లూరులో కోటి రూపాయలు చొప్పున రాబట్టింది. తమిళనాడు + కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయల షేర్.. 17 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలాగే ఓవర్సీస్‌లో 9 కోట్ల రూపాయల షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను విజయ్ దేవరకొండ మూవీ రాబట్టింది. దాంతో కలుపుకుని కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 38 కోట్ల రూపాయల షేర్ .. 92 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

కింగ్డమ్ 6వ రోజు కలెక్షన్స్
కింగ్డమ్ 6వ రోజు వసూళ్లను పరిశీలిస్తే.. వర్కింగ్ డేస్‌ కావడంతో విజయ్ దేవరకొండ చిత్రానికి బుకింగ్స్ బాగా పడిపోయాయి. 6వ రోజు మధ్యాహ్నం 4 గంటల వరకు కింగ్డమ్‌కు తెలుగు వెర్షన్‌‌లో 14 శాతం, తమిళ వెర్షన్‌లో 11 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. 6వ రోజు కింగ్డమ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రూపాయలు, కర్ణాటక+ కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 40 లక్షల రూపాయలు చొప్పున 1.70 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో 6 రోజుల వరకు కింగ్డమ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 94 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X