Kingdom Box Office Day 7: వారం రోజుల్లో కింగ్డమ్ కలెక్షన్స్.. నష్టాలు తప్పాలంటే ఎన్ని కోట్లు వసూళ్లు చేయాలంటే?
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కింగ్డమ్. ఈ చిత్రం జూలై 31న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా బాక్సాఫీస్ వద్ద మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ వంటి బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ క్రమంలో సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్? 7వ రోజు బాక్సాఫీస్ వసూళ్లు ఎన్ని కోట్లనే వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ పాయింట్?
ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ విజయ్ దేవరకొండ, సత్య రాజ్, భాగ్యశ్రీ బోర్సే తో పాటు టాప్ టెక్నీషియన్స్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ భాగమవడంతో సినిమాకు భారీగానే ఖర్చైంది. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలన్నీ కలుపుకొని రూ.130 కోట్లు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే 56 కోట్ల ఇండియా షేర్, 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

6 రోజుల వసూళ్లు..
విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రానికి 6 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి. డే1 ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.35 కోట్లు, 2వ రోజు రూ.10 కోట్లు, 3వ రోజు రూ.11 కోట్లు, 4వ రోజు రూ.10 కోట్లు, 5వ రోజు రూ.2 కోట్లు, 6వ రోజు రూ.2 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇలా 6 రోజుల వరకు ఇండియా నెట్ రూ.44.40 కోట్లకు చేరుకుందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
7వ రోజు వసూళ్లు ఇలా..
ఈ చిత్రానికి ప్రస్తుతం వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఇక 7వ రోజు సాయంత్రం 4 గంటల వరకు కేవలం 40 లక్షల రూపాయల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. 7వ రోజు వరల్డ్ వైడ్ గా రూ.1 కోటి వసూల్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో 7వ రోజు వరకు ఇండియా నెట్
ఏరియా వైజ్ గా కలెక్షన్స్..
తెలుగు రాష్ట్రాల్లో (ఏపీ+ తెలంగాణ) ఈ చిత్రం రూ.41 కోట్లు, కర్ణాటకలో రూ.5 కోట్ల, తమిళనాడులో రూ.4 కోట్లు, కేరళలో రూ.2.50 కోట్లు, రెస్టా ఆఫ్ ఇండియా లో 1 కోటి రూపాయలు వసూల్ చేసింది. ఇలా ఇండియాలో రూ.52 కోట్ల వరకు వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఓవర్సీస్ లో రూ.19 కోట్లు వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా 7 రోజుల్లో 72 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కింగ్డమ్ లాభాల్లోకి రావాలంటే?
విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం ఇప్పటి వరకు 72 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఈ చిత్రం 112 కోట్లు గ్రాస్ వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుకోనుంది. దీంతో ఇంకా ఈ చిత్రం 30 కోట్లు వసూళ్లు చేస్తేనే లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మొదటి వారం బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కాస్తా మంచి వసూళ్లనే రాబట్టింది. 2వ వారంలో ఎలాంటి వసూళ్లను అందుకుంటుందనేది చూడాలి.


Click it and Unblock the Notifications











