Kingdom Day 8 Collection: కింగ్డమ్‌కు షాకింగ్ కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ మూవీకి ఎన్ని కోట్లంటే?
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. సత్యదేవ్, వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. జూలై 31న కింగ్డమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో కింగ్డమ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 8వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులతో కలిపి కింగ్డమ్ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో విషయానికి వస్తే .. కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల మేర కింగ్డమ్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కింగ్డమ్ మూవీకి 54.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. విజయ్ దేవరకొండ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల రూపాయల షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను 2850 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

కింగ్డమ్ 7 రోజుల కలెక్షన్స్
కింగ్డమ్ వసూళ్లు పరిశీలిస్తే.. ఇండియా వైడ్‌గా తొలిరోజు 18 కోట్ల రూపాయలు, రెండో రోజు 8 కోట్ల రూపాయలు, 3వ రోజున 8 కోట్ల రూపాయలు, 4వ రోజున 8 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు, 6వ రోజున 2 కోట్ల రూపాయలు, 7వ రోజున 1.50 కోట్ల రూపాయలు ఆర్జించింది. దాంతో కలుపుకుని ఇండియా వైడ్‌గా కింగ్డమ్ చిత్రం తొలి వారం 48 కోట్ల రూపాయల నెట్.. 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది కింగ్డమ్. దాంతో విజయ్ దేవరకొండ చిత్రానికి 7 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల వరకు కింగ్డమ్ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలిరోజున 12 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, 3వ రోజున 5 కోట్ల రూపాయలు, 4వ రోజున 5 కోట్ల రూపాయలు, 5వ రోజున కోటి రూపాయలు, 6వ రోజున 80 లక్షల రూపాయలు, 7వ రోజున 65 లక్షల రూపాయలు వచ్చింది. దాంతో తొలి వారం తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ చిత్రానికి 28 కోట్ల రూపాయల షేర్ .. 47 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కింగ్డమ్ వసూళ్లు చూస్తే.. నైజాంలో 12.50 కోట్ల రూపాయలు, సీడెడ్ 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.50 కోట్ల రూపాయలు, కృష్ణాలో 2.50 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.50 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది. తమిళనాడు + కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 9 కోట్ల రూపాయల షేర్.. 20 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలాగే ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను విజయ్ దేవరకొండ మూవీ రాబట్టింది. దాంతో కలుపుకుని కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 44 కోట్ల రూపాయల షేర్ .. 97 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
కింగ్డమ్ 8వ రోజు కలెక్షన్స్
ఫస్ట్ వీక్ ముగిసిన తర్వాత కింగ్డమ్ చిత్రం డల్‌గానే తన పరుగును ప్రారంభించింది. 8వ రోజు సాయంత్రం 4 గంటల వరకు విజయ్ దేవరకొండ మూవీకి తెలుగు వెర్షన్‌లో 12 శాతం, తమిళ వెర్షన్‌లో 10 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ పెరుగుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. కింగ్డమ్ మూవీకి 8వ రోజున 75 లక్షల రూపాయల వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో కలిపి కింగ్డమ్ 8 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 98 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతుందని భావిస్తున్నారు. కింగ్డమ్ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 13 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











