Kingdom Day 9 Collection: కింగ్డమ్ వసూళ్లపై భారీ దెబ్బ .. విజయ్ దేవరకొండ మూవీకి ఇంకెంత రావాలి?
వరుస ఫ్లాపుల్లో ఉన్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో చేసిన సినిమా కింగ్డమ్. జెర్సీతో టాలీవుడ్, బాలీవుడ్‌లలో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. కింగ్డమ్‌లో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు.
సి సత్యదేవ్, వెంకీటేష్ వీపీ, అయ్యప్ప శర్మ, గోపరాజు రమణ, మనీష్ చౌదరి, బాబురాజ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. జూలై 31న కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో కింగ్డమ్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత? 9వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
కింగ్డమ్‌ను 130 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 15 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 6 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 15 కోట్ల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కర్ణాటకలో 3.5 కోట్ల రూపాయలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల మేర కింగ్డమ్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో కలిపి వరల్డ్ వైడ్‌గా కింగ్డమ్ మూవీకి 54.5 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల రూపాయల షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను 2850 స్క్రీన్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
కింగ్డమ్ 8 రోజుల కలెక్షన్స్
కింగ్డమ్ వసూళ్లు పరిశీలిస్తే.. ఇండియా వైడ్‌గా తొలిరోజు 18 కోట్ల రూపాయలు, రెండో రోజు 8 కోట్ల రూపాయలు, 3వ రోజున 8 కోట్ల రూపాయలు, 4వ రోజున 8 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు, 6వ రోజున 2 కోట్ల రూపాయలు, 7వ రోజున 1.50 కోట్ల రూపాయలు, 8వ రోజు 1.50 కోట్ల రూపాయలు ఆర్జించింది. దాంతో కలుపుకుని ఇండియా వైడ్‌గా కింగ్డమ్ చిత్రం 8 రోజుల వరకు 50 కోట్ల రూపాయల నెట్.. 77 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. దాంతో విజయ్ దేవరకొండ చిత్రానికి 8 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 99 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల వరకు కింగ్డమ్ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలిరోజున 12 కోట్ల రూపాయలు, రెండో రోజున 5 కోట్ల రూపాయలు, 3వ రోజున 5 కోట్ల రూపాయలు, 4వ రోజున 5 కోట్ల రూపాయలు, 5వ రోజున కోటి రూపాయలు, 6వ రోజున 80 లక్షల రూపాయలు, 7వ రోజున 65 లక్షల రూపాయలు, 8వ రోజు 1.20 కోట్ల రూపాయలు వచ్చింది. దాంతో 8 రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ దేవరకొండ చిత్రానికి 29 కోట్ల రూపాయల షేర్ .. 48 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా కింగ్డమ్ వసూళ్లు చూస్తే.. నైజాంలో 13 కోట్ల రూపాయలు, సీడెడ్ 5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 3 కోట్ల రూపాయలు, కృష్ణాలో 3 కోట్ల రూపాయలు, నెల్లూరులో 2 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది. తమిళనాడు + కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 9.5 కోట్ల రూపాయల షేర్.. 21 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలాగే ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయల షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్‌ను విజయ్ దేవరకొండ మూవీ రాబట్టింది. దాంతో కలుపుకుని కింగ్డమ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 45 కోట్ల రూపాయల షేర్ .. 99 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.
కింగ్డమ్ 9వ రోజు కలెక్షన్స్
శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, వర్కింగ్ డే ప్రభావం గట్టిగా పడింది. మార్నింగ్ షో, మ్యాట్నీలకు బుకింగ్ డల్‌గా సాగింది. 9వ రోజు సాయంత్రం 5 గంటల వరకు కింగ్డమ్ మూవీకి తెలుగు వెర్షన్‌లో 14 శాతం, తమిళంలో 13 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఈరోజు బుకింగ్స్ అదిరిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 9వ రోజు కింగ్డమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కోటి రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు. దీంతో కలిపి ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ మూవీకి వరల్డ్ వైడ్‌గా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 12 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











