Kingdom Day 1 AP TG Collections: బాక్సాఫీస్ మోత మోగించిన కింగ్డమ్‌.. విజయ్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన కింగ్డమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూలై 31వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా ఓవర్సీస్‌ కలెక్షన్ల విషయానికి వస్తే..

కింగ్డమ్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను శ్రీలంకలోని జాఫ్నా జైలులో చిత్రీకరించారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 130 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 15 కోట్లతో సుమారుగా 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 37 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

Kingdom Movie Day 1 Box Office

కింగ్డమ్ మూవీకి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ స్పెడ్ కావడంతో ఈవెనింగ్ షోలకు మంచి స్పందన కనిపించింది. దాంతో ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా నమోదు అయ్యాయి. ఈ సినిమా నైజాంలో 4.20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక సీడెడ్‌లో 1.7 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. సీడెడ్‌లో విజయ్ దేవరకొండ మూవీకి అత్యధిక వసూళ్లు రావడం విశేషంగా మారింది.

ఇక ఆంధ్రాలో కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఆంధ్రాలోని ప్రధాన పట్టణాల్లో హౌస్‌ఫుల్ బుకింగ్స్‌తో సినిమా రికార్డుస్థాయి కలెక్షన్లను నమోదు చేసింది. ఈ చిత్రం ఉత్తరాంధ్రలో 1.16 కోట్ల రూపాయలు, గుంటూరులో 75 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 74 లక్షలు, కృష్ణా జిల్లాలో 59 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 44 లక్షలు, నెల్లూరు 34 లక్షల రూపాయలు వసూలు చేసింది.

కింగ్డమ్ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ కలెక్షన్లను రాబట్టింద. జీఎస్టీ మినహాయించి ఈ చిత్రం 9.92 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం తొలి రోజే 40 శాతం రికవరీ సాధించింది అని నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. తొలివారంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రం ఏ మేరకు డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు లాభాలను సాధించి పెడుతుందో వేచి చూడాల్సిందే.

కింగ్డమ్ సినిమా విడుదలైన అన్ని కేంద్రాల్లోను, అన్ని భాషల్లోను భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం కేరళలో 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం ఓవర్సీస్‌లో 1 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా సుమారుగా 40 కోట్లకుపైగా వసూళ్లను రాబడుతుందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X