Kingdom Day 1 US, Australia Collections: కింగ్డమ్ ఓవర్సీస్‌ కలెక్షన్లు.. అమెరికా, ఆస్ట్రేలియాలో ఎన్ని కోట్లంటే

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో రూపొందిన కింగ్డమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూలై 31వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా ఓవర్సీస్‌ కలెక్షన్ల విషయానికి వస్తే..

కింగ్డమ్ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను శ్రీలంకలోని జాఫ్నా జైలులో చిత్రీకరించారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని 130 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్‌ నార్త్ అమెరికాలో సుమారుగా 10 కోట్ల రూపాయలు, ఇతర దేశాలు థియేట్రికల్ రైట్స్ కలిపి 15 కోట్ల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Kingdom Day 1 Box Office Collections in Overseas

నార్త్ అమెరికాలో అంటే.. యూఎస్, కెనడా దేశాల్లో ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు కలిపితే అమెరికాలో 1 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యధికంగా ఓపెనింగ్స్ లభించిన చిత్రంగా ఈ సినిమా ఘనతను సాధించింది.

ఇక ఆస్ట్రేలియాలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ మూవీని 60 లొకేషన్లలో 134 షోలను ప్రదర్శించారు. దాంతో ఈ సినిమా తొలి రోజు 1 లక్ష ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 56 లక్షల రూపాయల మేర కలెక్షన్లు సాధించింది. టైర్ 2 హీరోలలో ఈ వసూళ్లు ఆల్ టైమ్ రికార్డుగా ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి.

ఇక యూకే, ఐర్లాండ్, గల్ఫ్, న్యూజిలాండ్ తదితర దేశాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ సాధిస్తున్నది. ఈ సినిమా అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలతో కలిపి ఈ మూవీ సుమారుగా 15 కోట్ల రూపాయలు తొలి రోజున వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ సినిమా రానున్న రోజుల్లో కూడా భారీ వసూళ్లు రాబడుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తున్నది.

కింగ్డమ్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాత నాగవంశీ, హీరో విజయ్ దేవరకొండ, సత్యదేవ్, వెంకటేష్ వైపీ మీడియాతో ముచ్చటించారు. సక్సెస్ మీట్ సమావేశాన్ని నిర్వహించి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకొన్నారు. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ.. మా సినిమాకు అన్ని వర్గాల మద్దతుతో భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 50 శాతానికి పైగా రాబడిని సొంతం చేసుకొన్నది. ఈ వారాంతంలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X