Kingdom Overseas Collections: ఓవర్సీస్‌లో కింగ్డమ్ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. నాని రికార్డు విజయ్ దేవరకొండ బ్రేక్
టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా కోసం జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీని భారీగా విదేశాల్లో పలు చోట్ల చిత్రీకరించారు. నటీనటులు,సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 10 కోట్ల రూపాయలు మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ మొదలైనప్పటి నుంచి ర్యాంపేజ్ ప్రారంభించింది. ఈ చిత్రానికి భారీ ప్రీ సేల్స్ కనిపించాయి. అయితే విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్డెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. అమెరికాలో మాత్రం ఈ చిత్రం ప్రీమియర్లతో కలిపి అధికారికంగా 750K డాలర్లు, అనధికారికంగా 850K అంటే.. ఇండియన్ కరెన్సీలో 7 కోట్ల రూపాయలు రాబట్టింది అని ఓవర్సీస్ డిస్టిబ్యూటర్ శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ వెల్లడించింది.
వరల్డ్ వైడ్‌గా కింగ్డమ్ సినిమా ప్రీ సేల్స్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓవర్సీస్‌లో 7 కోట్లకుపైగా వసూళ్లు, ఇండియాలో 10 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. ఓపెనింగ్ డే ఈ చిత్రం 17 కోట్ల రూపాయలు వసూళ్లు బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. తెలుగులో టైర్ 2 హీరోలలో టాప్‌గా విజయ్ దేవరకొండ నిలిచాడు. ఇంతకు ముందు నేచురల్ స్టార్ నాని నటించిన దసరా, హిట్ 3 సినిమాలు అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలుగా ఉండేవి. కింగ్డమ్ ఆ రికార్డును అధిగమించింది.


Click it and Unblock the Notifications











