Kingdom Business: కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు? విజయ్ దేవరకొండ మూవీ లాభాల్లోకి రావాలంటే?
టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా కోసం జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీని భారీగా విదేశాల్లో పలు చోట్ల చిత్రీకరించారు. నటీనటులు,సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 130 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించినట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. అయితే ఈ సినిమా నైజాం హక్కులు 15 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 6 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల మేర జరిగింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రిలీజ్ సుమారుగా 36 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక తెలుగేతర రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం కర్ణాటక రైట్స్ 3.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల రూపాయలు మేర జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 54.5 కోట్ల మేర జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 56 కోట్లు షేర్.. 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కింగ్డమ్ ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్‌కు సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. అలాగే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు కూడా డీసెంట్ నెంబర్లను చూపిస్తున్నాయి. ఇంకా రెండు రోజుల వ్యవధి ఉండటం వల్ల అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా విజయ్ దేవరకొండ కెరీర్‌లో రికార్డు స్థాయిలో ఉండే ఛాన్స్ లేకపోలేదని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











