6 రోజుల్లో 1200 కోట్ల కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద సునామీ. వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్న మూవీ ఎంటో తెలుసా

అమెరికన్ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ సినిమా కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా సునామీని తలపించే కలెక్షన్లను రాబడుతున్నది. హాలీవుడ్ ప్రముఖులు జోస్ ఫ్రైడ్‌మ్యాన్ రచనా సహకారం అందించగా, డైరెక్టర్ బెస్ బాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని వెస్ బాల్, జో హార్ట్‌విక్ జూనియర్.. రిక్ జఫ్ఫా, అమండా సిల్వర్, జాసన్ టీ రీడ్ నిర్మించారు. మే 10వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయనే వివరాల్లోకి వెళితే..

కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ విషయానికి వస్తే.. 2017లో విడుదలైన వార్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీకి సీక్వెల్. ఈ సినిమా ఫ్రాంచైజీలో నాలుగోది. ఈ చిత్రంలో ఓవెన్ టీగ్, కెవిన్ డ్యురాండ్, పీటర్ మాకాన్, ఫ్రెయా అలెన్, విలియం హెచ్ మేసీ తదితరులు నటించారు. ఇక కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే.. అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాను 160 మిలియన్ డాలర్ల వ్యయంతో అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 1300 కోట్లకుపైగా వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ ప్రమోషన్స్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Kingdom of the Planet of the Apes Estimated Box Office Collections Worldwide

అత్యంత ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూసిన ఈ మూవీకి రిలీజ్ తర్వాత భారీ ఆదరణ దక్కింది. ఇండియాలో ఎలక్షన్ ఫీవర్‌ను ఎదురించి మంచి కలెక్షన్లను సాధించింది. ఇండియాలో ఈ చిత్రం 16 కోట్లకుపైగా గ్రాస్, 15 కోట్లకుపైగా నికర వసూళ్లను సాధించింది. ఇంకా నిలకడగా కలెక్షన్లను సాధిస్తున్నది. ఇక ఓవర్సీస్‌లో కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ దక్కుతున్నది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, యూరోపియన్ దేశాల్లో బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 600 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

Kingdom of the Planet of the Apes Estimated Box Office Collections Worldwide

ఇక కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సినిమా ఉత్తర అమెరికాలో ప్రభంజనం కొనసాగిస్తున్నది. ఈ చిత్రం అమెరికా, కెనడాలో కలిపి 600 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా కేవలం 6 రోజుల్లో 1200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X