Kingston Day 1 Collections: కింగ్స్టన్ డే 1 కలెక్షన్లు.. జీవీ కుమార్ మూవీకి ఎన్ని కోట్లంటే?

దక్షిణాది సినిమా పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ నిర్మాతగా మారి తన సొంత బ్యానర్‌ ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన చిత్రం కింగ్స్టన్ (Kingston). జీ స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్‌తో కలిసి దివ్య భారతి తదితరులు నటించారు. మార్చి 7వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఎన్ని స్క్రీన్లలో రిలీజైంది? ఎంత కలెక్ట్ చేస్తున్నది అనే వివరాల్లోకి వెళితే..

కింగ్స్టన్ సినిమాను తమిళంలో చిన్నస్థాయి నటులతో, టాలెంటెడ్ టెక్నిషియన్స్‌తో కలిసి రూపొందించారు. ఈ మూవీకి వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణగా మారాయి. భారీగా సెట్ వేసి సముద్రపు బ్యాక్ డ్రాప్‌తో చిత్రాన్ని తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 20 కోట్ల రూపాయల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు అందుబాటులో లేవు. కానీ తెలుగులో కమిషన్ బేస్డ్ మీద మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు.

Kingston Day 1 Box Office Collections Worldwide GV Prakash Kumar Divya Barthi movie decent start at Box Office

కింగ్స్టన్ సినిమా ప్రోమోషనల్ కంటెంట్ ముఖ్యంగా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై కొంత క్యూరియాసిటీ ఏర్పడింది. దాంతో తొలి సముద్రం బ్యాక్ డ్రాప్‌గా హారర్, థ్రిల్లర్ మూవీ రాబోతుందనే విషయంపై అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో ఈ సినిమాను దక్షిణాదిలో సుమారుగా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

Take a Poll

జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన ఈ చిత్రానికి మీడియం రేంజ్ ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళంలో ఈ సినిమా సుమారుగా 40 శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకొన్నది. పాండిచ్చేరి, దిండిగల్, త్రిచీ ప్రాంతాల్లో మంచి ఓపెనింగ్స్ లభించాయి. తెలుగులో పెద్దగా రెస్పాన్స్ కనిపించలేదు. ఈ సినిమాకు 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్, బెంగళూరు, వరంగల్ తదితర ప్రాంతాల్లో స్పందన లభించింది.

Kingston Day 1 Box Office Collections Worldwide GV Prakash Kumar Divya Barthi movie decent start at Box Office

దివ్య భారతీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు డిసెంట్‌గా బాక్సాఫీస్ వద్ద రెస్పాన్స్ కనిపించింది. తమిళంలో ఈ చిత్రం 1 కోటి రూపాయల నెట్, 2 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది. తెలుగులో 30 లక్షలు నికరంగా 60 లక్షల రూపాయలు గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 50 లక్షల రూపాయలు నికరంగా రాబట్టింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 3.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కింగ్స్టన్ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సుమారుగా 12 కోట్లుగా వాల్యూ కట్టారు. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే.. కనీసం ఈ సినిమా 25 కోట్ల గ్రాస్ వసూళ్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: gv prakash kumar Kingston
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X