KA Movie Day 1 Box Office: దుమ్మురేపిన కిరణ్ అబ్బవరం థ్రిల్లర్ మూవీ.. క మూవీ ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే

KA Movie Day 1 Collections: తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క (KA). ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ మూవీని విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజైన క సినిమాకి కు ఎన్ని కోట్ల వసూల్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

Recommended Video

KA Movie Day 1 Box Office: దుమ్మురేపిన కిరణ్ అబ్బవరం థ్రిల్లర్ మూవీ..| FilmiBeat Telugu

కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా నటించిన 'క' మూవీలో తన్వి రామ్, అచ్యుత్ రామ్, రెడిన్ కింగ్స్ లీ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. 'క' అనే ఒకే అక్షరాన్ని టైటిల్ పెట్టడంతో ఈ మూవీపై విడుదలకు ముందు నుంచే ఆసక్తి నెలకొల్పింది. క మూవీ కథ విషయానికి వస్తే.. ఈ సోర్టీ 1977లో సాగుతోంది. హీరో కిరణ్ అబ్బవరం ..అభినయ వాసుదేవ్ అనే పాత్రను పోషించారు. అభినయ వాసుదేవ్ ఓ అనాథ. తన బాల్యం మొత్తం ఓ అనాథాశ్రమంలో సాగుతోంది. అయితే..ఈ వ్యక్తికి వేరే వాళ్ళ ఉత్తరాలు చదివే అలవాటు ఉంది.

Kiran Abbavaram KA Movie Day 1 Box Office Collection Worldwide

ఆ ఇంట్రెస్ట్ తోనే పెద్దయ్యాక క్రిష్ణగిరి అనే ఓ కొండ గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా కూడా చేరతాడు. ఈ క్రమంలో ఆ ఊరు పోస్ట్ ఆఫీస్ హెడ్ గా పనిచేస్తున్న రంగారావు కూతురు సత్యభామ(నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు వాసుదేవ్. ఈ కథ చాలా హ్యాపీగా.. సాగిపోతున్నా.. తరుణంలో ఆ ఊళ్ళో అమ్మాయిలు కిడ్నాప్ అవుతుంటారు. ఆ విషయం ఆ ఊరిని భయాందోళనలకు గురి చేస్తోంది. దొంగతనంగా వేరే వాళ్ల లెటర్స్ చదివే వాసుదేవ్ కి ఓ ఉత్తరం ద్వారా అమ్మయిల మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఓ క్లూ దొరుకుతోంది. ఆ క్లూ ద్వారా మిస్టరీ కేసును ఎలా ఎలా చేదిస్తాడు? ఈ క్రమంలో వాసుదేవ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు?అనేది 'క'మూవీ.

గత కొంతకాలంగా హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)కు బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన హిట్ అందలేదు. వరుస ఫ్లాఫ్స్ అండ్ అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమాల రిజల్ట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని క అనే డిఫెరెంట్ మూవీ తో వచ్చారు. దీపావళీ పండుగ సందర్బంగా విడుదలైన క (KA) మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. షోలు, స్క్రీన్‌లు పెరుగుతున్నాయి. ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో.. డే వన్ కలెక్షన్లు కూడా పెరిగాయి. మాస్, స్టార్ హీరోకి వచ్చినట్టు వందల కోట్ల కలెక్షన్లు రాకపోయినా.. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అనేలా మాత్రం ఉన్నాయి.

Kiran Abbavaram KA Movie Day 1 Box Office Collection Worldwide

క మూవీ తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. లక్కీ భాస్కర్, అమరన్, బఘీర లాంటి సినిమాలతో పోల్చితే.. క మూవీ షోల సంఖ్య, ప్రీ బుకింగ్స్ కూడా చాలా తక్కువే. అయినా.. మంచి టాక్, మౌత్ టాక్ రావడంతో షోలు పెరిగాయి. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. దీంతో 'క' మూవీ బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అయింది. ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లు వసూల్ చేసింది. కిరణ్ అబ్బవరం కెరీర్లో క బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది.

క మూవీ డే 1 తెలుగు (2D) థియేటర్ ఆక్యుపెన్సీ చూస్తే.. మార్నింగ్ షో 53.17%, మధ్యాహ్నం షో 75.33%, సాయంత్రం షో 61.36%, నైట్ షో 74.25% ఆక్యుపెన్సీ సాధించింది. ఇలా తొలి రోజు 'క' మూవీ ఓవరాల్ గా 66.03 శాతం ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది. ఇలా క మూవీ తొలి రోజు దాదాపు రూ. 3.8 కోట్ల కలెక్షన్లు అందుకుంది. ఓ వైపు పండుగ, మరోవైపు.. వరుసగా హలీడేస్ ఉండటంతో మూవీ కలెక్షన్లు మరింత పెరుగుతాయని, క సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం కమ్ బ్యాక్ అవుతారని భావిస్తున్నారు ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X