KA Movie Day 1 Collections: అదరకొడుతున్న కిరణ్ అబ్బవరం సస్పెన్స్ డ్రామా.. క మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

KA Movie Day 1 Collections: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క (KA). నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించిన ఈ మూవీని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ దర్శక ద్వయం సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజైన ఈ సినిమా తొలి రోజు ఎన్ని కోట్ల వసూల్లు రాబట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా నటించిన మూవీ 'క'. దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిన ఈ మూవీలో తన్వి రామ్, అచ్యుత్ రామ్, రెడిన్ కింగ్స్ లీ.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. 'క' అనే ఒకే అక్షరంతో టైటిల్ పెట్టడంతో ఈ మూవీపై విడుదలకు ముందు నుంచే ఆసక్తి నెలకొల్పింది. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్స్ లో విడుదలైంది.

Kiran Abbavaram KA Movie Day 1 Expected Box Office Collections Worldwide

క మూవీ కథ విషయానికి వస్తే.. ఈ సోర్టీ 1977లో సాగుతోంది. అభినయ వాసుదేవ్ అనే పాత్రను కిరణ్ అబ్బవరం పోషించారు. అభినయ వాసుదేవ్ ఓ అనాథ తన బాల్యం మొత్తం ఓ అనాథాశ్రమంలో సాగుతోంది. ఈ వ్యక్తికి వేరే వాళ్ళ ఉత్తరం చదువుతూ ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ తోనే పెద్దయ్యాక చుట్టూ కొండల మధ్య ఉండే క్రిష్ణగిరి అనే ఓ గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా కూడా చేరతాడు. ఈ క్రమంలో ఆ ఊరు పోస్ట్ ఆఫీస్ హెడ్ గా పనిచేస్తున్న రంగారావు కూతురు సత్యభామ(నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు వాసుదేవ్.

ఈ కథ ఇలా సాగుతున్న తరుణంలో ఆ ఊళ్ళో అప్పుడప్పుడు అమ్మాయిలు తప్పిపోతుంటారు. దొంగతనంగా వేరే వాళ్ల లెటర్స్ చదివే వాసుదేవ్ కి ఓ ఉత్తరం ద్వారా అమ్మయిల మిస్సింగ్ సంబంధించిన ఓ క్లూ దొరుకుతోంది. ఆ క్లూ ద్వారా మిస్టరీ కేసును ఎలా ఎలా చేదిస్తాడు? ఈ క్రమంలో వాసుదేవ్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు? వాసుదేవ్ సత్య లవ్ సక్సెస్ అవుతుందా? అనే విషయాల సమాహారమే క మూవీ.

క మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నిజాం లో 3.6 కోట్లు, సీడెడ్ జిల్లాలో 1.4 కోట్లు, ఆంధ్ర లో రూ. 3 కోట్లతో దాదాపు తెలుగు రాష్ట్రాలలో రూ. 8 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక.. కర్ణాటక, ఓవర్సీస్ లలో మరో రెండు కోట్లు.. ఇలా మొత్తం మీద 'క' సినిమా వరల్డ్ వైడ్ గా 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే.. 'క' మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 11 కోట్ల వరకు కలెక్ట్ చేయాల్సి వస్తుంది.

Kiran Abbavaram KA Movie Day 1 Expected Box Office Collections Worldwide

గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ దగ్గర హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)కు సరైన హిట్ అందలేదు. వరుస ఫ్లాఫ్స్ అండ్ అండర్ పెర్ఫార్మ్ చేసిన సినిమాల రిజల్ట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఒక డిఫెరెంట్ మూవీ క(Ka)తో వచ్చారు. దీపావళీ పండుగ సందర్బంగా విడుదలైన క (KA) మూవీ ప్రీమియర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు లో మంచి బజ్ నే సొంతం చేసుకుంది. కానీ, ఇతర మూవీస్ తో పోల్చితే కిరణ్ అబ్బవరం మూవీ క(Ka Movie) ప్రధానంగా లక్కీ భాస్కర్ మూవీ నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటుంది.

ఇక క మూవీ తొలి రోజు అంచనా కలెక్షన్ల విషయానికి వస్తే.. లక్కీ భాస్కర్, అమరన్, బఘీర లాంటి మూవీస్ తో పోల్చితే క మూవీ కి షోల కౌంట్ చాలా తక్కువ. ఈ సినిమాలతో పోల్చిన ప్రీ బుకింగ్స్ కూడా చాలా తక్కువే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బౌన్స్ బ్యాక్ అవుతారని భావిస్తున్నారు. ఇక క మూవీ తొలి రోజు.. దాదాపు.. రూ. 4 నుంచి 4.5 కోట్ల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే.. టైటిల్ నుంచి ట్రైలర్ వరకు క మూవీ సూపర్ గుడ్ ఫీల్ అందిస్తున్న ఈ సినిమా ద్వారా కిరణ్ అబ్బవరం కమ్ బ్యాక్ అవుతారని భావిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

More from Filmibeat

Read more about: ka kiran abbavaram diwali 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X