KA Movie Day 10 Box Office: వీకెండ్‌లో దుమ్మురేపిన కిరణ్ మూవీ.. క మూవీ పదోవ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

KA Movie Day 10 Box Office: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథనాయకుడిగా నటించిన లెటేస్ట్ సినిమా క (KA). సస్పెన్స్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ లు హీరోయిన్స్ గా నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సస్పెన్స్ త్రిల్లర్ మూవీకి దర్శక ద్వయం సుజీత్,సందీప్ లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాల కృష్ణ రెడ్డి నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన 'క' సినిమా తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అలాంటి క మూవీ ఇప్పటి వరకూ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది? పదోవ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..

కిరణ్ అబ్బవరం క (KA)మూవీ.. అమరన్, లక్కీ బాస్కర్ వంటి భారీ బడ్జెట్ సినిమాల నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటునే భారీ విజయాన్ని అందుకుంది. కిరణ్ అబ్బవరంకు క మూవీ మంచి కమ్ బ్యాక్ మూవీగా మారింది. క మూవీ తొలి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని చేసుకుని భారీ ఓపెనింగ్స్ అందుకుంది. అలాగే.. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. ఈ వారం కొత్తగా రిలీజ్ అయినా సినిమాలు అంతగా ఇంపాక్ట్ ని చూపించకపోవడంతో దీపావళి మూవీస్ అయిన కిరణ్ అబ్బవరం మూవీ కలెక్షన్లలో జోరు కనిపిస్తుంది. 9వ రోజుతో పోల్చితే 10 రోజు మంచి గ్రోత్ కనిపించింది.

Kiran Abbavaram KA Movie Day 10 Box Office Collection Worldwide

'క'మూవీ తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకోవడంతో కలెక్షన్లు ఓ రేంజ్ లో వచ్చాయి. దీంతో క మూవీ డే 1 రూ. 3.8 కోట్ల వసూలు (ఇండియన్ బాక్సాఫీస్) చేయగా.. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని మొత్తం రూ.6.18 కోట్లు వసూలు చేసింది. ఇక రెండవ రోజు రూ.3 కోట్లు, 3 వ రోజు రూ. 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు హైయ్యేస్ట్ రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసి.. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది 'క'.

మొత్తానికి మొదటి వీకెండ్ లో క మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించింది. భారీ మొత్తంలో వసూళ్లను రాబట్టింది. కానీ, ఐదో రోజు నుంచి క మూవీ కలెక్షన్ వసూళ్లు పడిపోయాయి. 5 వ రోజు 1.60 కోట్లు కలెక్ట్ చేయగా.. ఆరోవ రోజు రూ. 1.50 కోట్లు, ఏడో రోజు రూ. 1.2 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 0.8 కోట్లు రాబట్టింది. వీకెండ్ ప్రారంభం కావడంతో తొమ్మిదో రోజు వసూళ్లలో కాస్త పెరుగుదల కనిపించింది. దీంతో డే 9 న రూ. 1.02 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇక పదోవ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాలను పరిశీలిస్తే.. క మూవీ 10వ రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరుని చూపెడుతూ మాస్ రచ్చ చేసింది. డే 10 నాడు బాక్సాఫీస్ వద్ద 1. 80 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ కలెక్షన్లతో క మూవీ ఇప్పటివరకూ మొత్తం రూ. 21.85 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

Kiran Abbavaram KA Movie Day 10 Box Office Collection Worldwide

ఇక 'క'మూవీ డే 10 థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకెళ్తే.. సక్ నిల్క్ అంచనాల ప్రకారం క మూవీ తెలుగు రాష్ట్రాల్లో పదోవ రోజున అంటే నవంబర్ 09 తేదీ శనివారం నాడు.. ఉదయం షోలు 21.89 శాతం, మధ్యాహ్నానికి 31.63 శాతం, ఫస్ట్ షోలకు 36.14శాతం, ఇక నైట్ షోలకు 44.90 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇలా డే 10 నాడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 33.64 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.

మొత్తానికి సెకండ్ వీకెండ్ లో ఆక్యుపెన్సీ పెరిగింది. నార్మల్ డేస్ లో థియేటర్ ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. కానీ, శుక్రవారం సాయంత్రం నుంచి క్రమంగా థియేటర్ ఆక్యుపెన్సీ పెరుగుతూ వస్తుంది. ఇలా ఆక్యుపెన్సీ పెరుగుతుండటంతో కలెక్షన్లలో కూడా పెరుగుదల కనిపిస్తోంది. ఇదే జోరు నేడు కూడా ఉంటుందనీ, భారీగానే కలెక్షన్లు అందుకునే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి వీకెండ్ లో వచ్చిన విధంగా కలెక్షన్లు రావాలని కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: ka ka box office kiran abbavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X