KA Movie Day 11 Box Office: సెకండ్ వీకెండ్ లో కుమ్మేసిన కిరణ్ అబ్బవరం మూవీ.. క మూవీ 11వ రోజు కలెక్షన్ ఎన్ని

KA Movie Day 11 Box Office: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లెటేస్ట్ సినిమా క (KA). సస్పెన్స్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ లు హీరోయిన్స్ గా నటించారు. క మూవీని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాల కృష్ణ రెడ్డి నిర్మించగా..దర్శక ద్వయం సుజీత్, సందీప్ లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సస్పెన్స్ త్రిల్లర్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. పాజిటివ్ టాక్ అందుకున్న క మూవీ ఇప్పటి వరకూ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది ? 11వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..

కిరణ్ అబ్బవరం క (KA)మూవీ.. అమరన్, లక్కీ బాస్కర్ వంటి భారీ బడ్జెట్ సినిమాల నుంచి గట్టిపోటీని ఎదుర్కుంటుంది. కానీ, పాజిటివ్ అందుకోవడంతో భారీ ఓపెనింగ్స్ అందుకుంది. దీంతో భారీ విజయాన్ని అందుకుంది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో మంచి కమ్ బ్యాక్ మూవీగా క మూవీ నిలిచింది. నార్మల్ డేస్ లో కలెక్షన్లు తగ్గినా.. వీకెండ్ లో రోజురోజుకు కలెక్షన్స్ పెరిగాయి. ఈ వారం కొత్తగా సినిమాలు రిలీజ్ అయినా.. అవి అంతగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. దీంతో దీపావళికి విడుదలైన సినిమాలే సందడి చేస్తున్నాయి. అలా.. సెకండ్ వీకెండ్ లో కిరణ్ అబ్బవరం మూవీ కలెక్షన్లలో జోరు కనిపిస్తుంది.

Kiran Abbavaram KA Movie Day 11 Box Office Collection Worldwide

'క'మూవీ తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకోవడంతో కలెక్షన్లు ఓ రేంజ్ లో వచ్చాయి. దీంతో క మూవీ డే 1 రూ. 3.8 కోట్ల వసూలు (ఇండియన్ బాక్సాఫీస్) చేయగా.. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని మొత్తం రూ.6.18 కోట్లు వసూలు చేసింది. ఇక రెండవ రోజు రూ.3 కోట్లు, 3 వ రోజు రూ. 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు హైయ్యేస్ట్ రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసి.. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది 'క'. మొత్తానికి మొదటి వీకెండ్ లో క మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించింది.

కానీ, 5 వ రోజు నుంచి క మూవీ కలెక్షన్ వసూలు క్రమంగా పడిపోయాయి. 5 వ రోజు 1.60 కోట్లు కలెక్ట్ చేయగా.. ఆరోవ రోజు రూ. 1.50 కోట్లు, ఏడో రోజు రూ. 1.2 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 0.8 కోట్లు వసూలు చేసింది. కానీ, వీకెండ్ ప్రారంభం నుంచి.. మళ్లీ కలెక్షన్లు పుంజుకున్నాయి. ఇలా.. తొమ్మిదో రోజు రూ.1.02 కోట్లు కలెక్ట్ చేసింది. పదోవ రోజు రూ. 1. 80 కోట్లు వసూలు చేసింది క మూవీ. అంటే..
9వ రోజుతో పోల్చితే 10 రోజు కలెక్షన్లలో మంచి గ్రోత్ కనిపించింది.

Kiran Abbavaram KA Movie Day 11 Box Office Collection Worldwide

ఇక 11వ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాలను పరిశీలిస్తే.. క మూవీ 11 వ రోజు అన్ని చోట్లా కలెక్షన్లలో జోరు కనిపించింది. డే 11 బాక్సాఫీస్ వద్ద 1 .95 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ కలెక్షన్లతో క మూవీ ఇప్పటివరకూ మొత్తం రూ. 23.35 కోట్లు వసూలు చేసినట్టు అంచనా. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.42 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

ఇక 'క'మూవీ డే 11 థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకెళ్తే.. సక్ నిల్క్ అంచనాల ప్రకారం క మూవీ తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజున అంటే నవంబర్ 10 తేదీ ఆదివారం నాడు.. ఉదయం షోలు 22.21 శాతం, మధ్యాహ్నానికి 37.56 శాతం, ఫస్ట్ షోలకు 45.36 శాతం, ఇక నైట్ షోలకు 29.14 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇలా డే 10 నాడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 33.57 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.

More from Filmibeat

Read more about: ka ka box office kiran abbavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X