KA Movie Day 12 Box Office: తగ్గుతున్న కిరణ్ అబ్బవరం మూవీ వసూళ్లు .. క మూవీ 12వ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
KA Movie Day 12 Box Office: తెలుగు హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లెటేస్ట్ మూవీ క (KA movie). దర్శక ద్వయం సుజీత్, సందీప్ లు సంయుక్తంగా ఈ మూవీని సస్పెన్స్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ లు హీరోయిన్స్ గా నటించగా.. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాల కృష్ణ రెడ్డి నిర్మించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సస్పెన్స్ త్రిల్లర్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. పాజిటివ్ టాక్ అందుకున్న క మూవీ ఇప్పటి వరకూ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది ? 12వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
దీపావళి సందర్భంగా విడుదలైన కిరణ్ అబ్బవరం క (KA)మూవీ.. అమరన్, లక్కీ బాస్కర్ వంటి భారీ బడ్జెట్ సినిమాల నుంచి గట్టిపోటీని ఎదుర్కుంటుంది. కానీ, పాజిటివ్ అందుకోవడంతో భారీ ఓపెనింగ్స్ అందుకుంది. కిరణ్ అబ్బవరం కి భారీ విజయాన్ని అందించింది. ఆయన కెరీర్ లో కమ్ బ్యాక్ మూవీగా క మూవీ నిలిచింది. వీకెండ్ లో కలెక్షన్స్ పెరిగినా.. నార్మల్ డేస్ లో కలెక్షన్లు తగ్గుతున్నాయి. గత వారం విడుదలైన సినిమాలు అంతగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. దీంతో కిరణ్ అబ్బవరం మూవీ చెప్పకోదగ్గ కలెక్షన్లను అందుకుంటుందనే చెప్పాలి.

'క'మూవీ తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.3.8 కోట్ల వసూలు చేయగా.. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని మొత్తం రూ.6.18 కోట్లు వసూలు చేసింది. ఇక రెండవ రోజు రూ.3 కోట్లు, 3 వ రోజు రూ. 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు హైయ్యేస్ట్ రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసి.. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది 'క'. మొత్తానికి మొదటి వీకెండ్ లో క మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించింది.
కానీ,5వ రోజు నుంచి క మూవీ కలెక్షన్ వసూలు క్రమంగా పడిపోయాయి. 5 వ రోజు 1.60 కోట్లు కలెక్ట్ చేయగా.. ఆరోవ రోజు రూ. 1.50 కోట్లు, ఏడో రోజు రూ. 1.2 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 0.8 కోట్లు వసూలు చేసింది. కానీ, వీకెండ్ లో మళ్లీ కలెక్షన్లు పుంజుకున్నాయి. దీంతో తొమ్మిదో రోజు రూ.1.02 కోట్లు కలెక్ట్ చేయగా.. పదవ రోజు రూ. 1.80 కోట్లు , 11వ రోజు రూ. 1 .95 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
క మూవీ వీకెండ్ లో దుమ్ము రేపింది. థియేటర్ ఆక్యుపెన్సి, కలెక్షన్లలో పెరుగుదల కనిపించింది. భారీ మొత్తంలో వసూలు చేసింది. కానీ, సోమవారం నాడు క మూవీ కలెక్షన్స్ మళ్లీ పడిపోయాయి. ఇక 12 వ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాలను పరిశీలిస్తే.. రూ. 0.75 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ కలెక్షన్లతో క మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకూ మొత్తం రూ. 24.10 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.43 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

ఇక 'క'మూవీ డే 12 థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకెళ్తే.. సక్ నిల్క్ అంచనాల ప్రకారం క మూవీ తెలుగు రాష్ట్రాల్లో 12వ రోజున అంటే నవంబర్ 11 తేదీ సోమవారం నాడు.. ఉదయం షోలు 13.52 శాతం, మధ్యాహ్నానికి 15.72 శాతం, ఫస్ట్ షోలకు 13.76 శాతం, ఇక నైట్ షోలకు 17.68 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇలా 12 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 15.17 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. క మూవీ వసూలు ముగిసినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే.. నవంబర్ 14న వరుణ్ తేజ మట్కా, సూర్య కంగువ విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ అందుకుంటే.. బాక్సాఫీస్ వద్ద ఈ బడా సినిమాల జోరే కనిపిస్తుంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











