KA Movie Day 13 Box Office: దారుణంగా పడిపోయిన కిరణ్ అబ్బవరం మూవీ వసూళ్లు .. క మూవీ 13వ రోజు కలెక్షన్ ఎన్ని
KA Movie Day 13 Box Office: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లెటేస్ట్ మూవీ క (KA movie). దర్శక ద్వయం సుజీత్, సందీప్ లు సంయుక్తంగా ఈ మూవీని సస్పెన్స్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సస్పెన్స్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ లు హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాల కృష్ణ రెడ్డి నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదలైంది. పాజిటివ్ టాక్ అందుకున్న క మూవీ ఇప్పటి వరకూ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది ? 13వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
కిరణ్ అబ్బవరం క (KA)మూవీ.. శివ కార్తీకేయన్ 'అమరన్', దుల్కర్ సల్మాన్ 'లక్కీ బాస్కర్' వంటి భారీ బడ్జెట్ సినిమాల నుంచి గట్టిపోటీని ఎదుర్కుంటుంది. కానీ, పాజిటివ్ అందుకోవడంతో భారీ ఓపెనింగ్స్ అందుకుంది. కిరణ్ అబ్బవరంకు భారీ విజయం అందించింది. కిరణ్ కెరీర్ లో గుడ్ కమ్ బ్యాక్ మూవీగా క మూవీ నిలిచింది. వీకెండ్ లో కలెక్షన్స్ పెరిగినా.. నార్మల్ డేస్ లో కలెక్షన్లు తగ్గుతున్నాయి. గతవారం విడుదలైన సినిమాలు అంతగా ప్రభావం చూపకపోవడంతో కిరణ్ అబ్బవరం మూవీ ఇంకా థియేటర్లలో నడుస్తునే ఉంది.

'క'మూవీ తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.3.8 కోట్ల వసూలు చేయగా.. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని మొత్తం రూ.6.18 కోట్లు వసూలు చేసింది. ఇక రెండవ రోజు రూ.3 కోట్లు, 3వ రోజు రూ. 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు హైయ్యేస్ట్ రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసి.. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది 'క'. మొత్తానికి మొదటి వీకెండ్ లో క మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధించింది.
కానీ,5వ రోజు నుంచి క మూవీ కలెక్షన్ వసూలు క్రమంగా పడిపోయాయి. 5 వ రోజు 1.60 కోట్లు కలెక్ట్ చేయగా.. ఆరోవ రోజు రూ. 1.50 కోట్లు, ఏడో రోజు రూ. 1.2 కోట్లు, 8 వ రోజు రూ. 0.8 కోట్లు వసూలు చేసింది. ఇక వీకెండ్ రావడంతో మళ్లీ కలెక్షన్లు పుంజుకున్నాయి. దీంతో తొమ్మిదో రోజు రూ.1.02 కోట్లు కలెక్ట్ చేయగా.. పదవ రోజు రూ. 1.80 కోట్లు , 11వ రోజు రూ. 1.95 కోట్లు, 12 వ రోజు రూ. 0.75 కోట్లు వసూలు చేసింది.
ఇక క మూవీ 13వ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాలను పరిశీలిస్తే.. కిరణ్ అబ్బవరం మూవీ వీకెండ్ లో దుమ్ము రేపింది. భారీ మొత్తంలో కలెక్షన్లను వసూలు చేసింది. కానీ, నార్మల్ డేస్ లో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. క మూవీ డే 13 .. కేవలం రూ. 0.55 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ కలెక్షన్లతో క మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకూ మొత్తం రూ.24.52 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.44 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

ఇక 'క'మూవీ డే 13 థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకెళ్తే.. సక్ నిల్క్ అంచనాల ప్రకారం క మూవీ తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజున అంటే నవంబర్ 12 తేదీ మంగళవారం నాడు.. ఉదయం షోలు 14.44 శాతం, మధ్యాహ్నానికి 15.24 శాతం, ఫస్ట్ షోలకు 13.13 శాతం, ఇక నైట్ షోలకు 15.75 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇలా 13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14.64 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.
ఈ కలెక్షన్ల బట్టి చూస్తే.. క మూవీ కలెక్షన్లు క్లోజ్ అయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే.. నవంబర్ 14న వరుణ్ తేజ 'మట్కా', సూర్య 'కంగువ' విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ అందుకుంటే.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాల జోరు కొనసాగుతోంది. మరీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











