KA Movie Day 15 Box Office: కిరణ్ అబ్బవరం మూవీ వసూళ్లు మూసినట్టేనా? క మూవీ 15వ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
KA Movie Day 15 Box Office: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లెటేస్ట్ మూవీ క(KA movie). ఈ మూవీని దర్శక ద్వయం సుజీత్, సందీప్ లు సంయుక్తంగా తెరకెక్కించారు. సస్పెన్స్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీరామ్ లు హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీని శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాల కృష్ణ రెడ్డి నిర్మించారు. అక్టోబర్ 31న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే.. ఇప్పటి వరకూ క మూవీ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది ? 15 వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
వరుస ఫెల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న కిరణ్ అబ్బవరం కు గుడ్ కమ్ బ్యాక్ మూవీగా 'క' మారింది. వాస్తవానికి క (KA)మూవీ.. శివ కార్తీకేయన్ 'అమరన్', దుల్కర్ సల్మాన్ 'లక్కీ బాస్కర్' వంటి భారీ బడ్జెట్ సినిమాలతో పోటీ పడి.. భారీ ఓపెనింగ్స్ అందుకుని.. భారీ విజయాన్ని అందుకుంది. గతవారం విడుదలైన సినిమాలు అంతగా ప్రభావం చూపకపోవడంతో ఈ మూవీ థియేటర్లలో నడుస్తునే ఉంది. కానీ, నిన్న విడుదలైన వరుణ్ తేజ 'మట్కా', సూర్య 'కంగువ'ల నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటుంది. ఈ పరిస్థితుల్లో ఏ రేంజ్ లో కలెక్షన్లు వసుందనే ఆసక్తికరంగా మారింది.

ఇక 'క'మూవీ ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్లు వివరాల్లోకెళ్తే.. తొలి రోజు రూ.3.8 కోట్ల వసూలు చేసి మంచి ఆరంభాన్ని అందుకుంది. ఆ తరువాత రెండవ రోజు రూ.3 కోట్లు, 3వ రోజు రూ. 3.75 కోట్లు , ఇక నాలుగో రోజు అత్యధికంగా రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసింది. తొలి వీకెండ్ లో కలెక్షన్ల పరంగా క మూవీ దుమ్మురేపింది. మంచి విజయాన్ని అందుకుంది. కానీ, నార్మల్ డేస్ లో కలెక్షన్లు పడిపోయాయి. 5వ రోజు 1.60 కోట్లు, 6వ రోజు రూ. 1.50 కోట్లు, 7వ రోజు రూ. 1.2 కోట్లు, 8వ రోజు రూ. 0.8 కోట్లు వసూలు చేసింది.
ఇక వీకెండ్ రావడంతో క మూవీ కలెక్షన్లు మళ్లీ పెరిగాయి. 9వ రోజు రూ.1.02 కోట్లు, 10వ రోజు రూ.1.80 కోట్లు, 11వ రోజు రూ. 1.95 కోట్లు, 12వ రోజు రూ. 0.75 కోట్లు, 13వ రోజు రూ.0.55 కోట్లు, 14 వ రోజు రూ. 0.35 కోట్లు వసూలు చేసింది. ఇక క మూవీ 15వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలను పరిశీలిస్తే..కేవలం రూ. 20 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ కలెక్షన్లతో (ఇండియన్ బాక్సాఫీస్ వద్ద) ఇప్పటివరకూ క మూవీ మొత్తం రూ.24.93 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.46 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

ఇక 'క'మూవీ డే 15 థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకెళ్తే.. సక్ నిల్క్ అంచనాల ప్రకారం క మూవీ తెలుగు రాష్ట్రాల్లో 15వ రోజున అంటే నవంబర్ 14 తేదీ గురువారం.. ఉదయం షోలు 12.59 శాతం, మధ్యాహ్నానికి 16.96శాతం, ఫస్ట్ షోలకు 14.37 శాతం, ఇక నైట్ షోలకు 23.70 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇలా 15వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 16.91 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.
నిన్న వరుణ్ తేజ 'మట్కా', సూర్య 'కంగువ' లాంటి భారీ బడ్జెట్ మూవీ విడుదల అయ్యాయి. ఇందులో కంగువా సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. కచ్చితంగా ఈ భారీ బడ్జెట్ మూవీ బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. ఇక మట్కా యావరేజ్ సొంతం చేసుకుంది. మూవీ రివ్యూ పాజివిటీగా వచ్చినా.. ఓపెనింగ్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు. కానీ, వీకెండ్ లో వసూళ్లు పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో క మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోవడం చూస్తే.. క మూవీ కలెక్షన్లు ముగిసినట్టే అనిపిస్తోంది. ఏదిఏమైనా కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా 'క' నిలించింది.


Click it and Unblock the Notifications











