KA Movie Day 17 Box Office: 'క'మూవీ 17 డేస్ కలెక్షన్స్ ఇవే.. కిరణ్ అబ్బవరం సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
KA Movie Day 17 Box Office: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లెటేస్ట్ మూవీ క(KA movie). శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. ఈ మూవీని దర్శక ద్వయం సుజీత్, సందీప్ "క" సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. సస్పెన్స్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీరామ్ లు హీరోయిన్స్ గా నటించారు. అక్టోబర్ 31న విడుదలైన క మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే..ఇప్పటి వరకూ క మూవీ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది? 17వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం క మూవీ ఘన విజయాన్ని అందుకుంది. శివ కార్తీకేయన్ 'అమరన్', దుల్కర్ సల్మాన్ 'లక్కీ బాస్కర్' వంటి భారీ బడ్జెట్ సినిమాలతో పోటీ పడి.. దీపావళి బాక్సాఫీస్ రేసులో విన్నర్‌గా నిలిచింది. అపజయాలతో ఇబ్బంది పడుతున్న కిరణ్ అబ్బవరం కు గుడ్ కమ్ బ్యాక్ మూవీగా 'క' మారింది. గత వారం విడుదలైన వరుణ్ తేజ 'మట్కా', సూర్య 'కంగువ'ల నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటుంది. ఈ పరిస్థితుల్లో క మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది.

ఇక 'క'మూవీ ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్లు వివరాల్లోకెళ్తే.. క మూవీ తొలి రోజు రూ.3.8 కోట్ల వసూలు చేసి మంచి ఆరంభాన్ని అందుకుంది. ఆ తరువాత రెండవ రోజు రూ.3 కోట్లు, 3వ రోజు రూ. 3.75 కోట్లు, ఇక నాలుగో రోజు అత్యధికంగా రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసింది. తొలి వీకెండ్ లో కలెక్షన్ల పరంగా క మూవీ దుమ్మురేపింది. కానీ, 5 రోజు నుంచి కలెక్షన్లు పడిపోయాయి. 5వ రోజు 1.60 కోట్లు, 6వ రోజు రూ. 1.50 కోట్లు, 7వ రోజు రూ. 1.2 కోట్లు, 8వ రోజు రూ. 0.8 కోట్లు వసూలు చేసింది.
ఇక వీకెండ్ రావడంతో క మూవీ కలెక్షన్లు మళ్లీ పెరిగాయి. 9వ రోజు రూ.1.02 కోట్లు, 10వ రోజు రూ.1.80 కోట్లు, 11వ రోజు రూ.1.95 కోట్లు, 12వ రోజు రూ. 0.75 కోట్లు, 13వ రోజు రూ.0.55 కోట్లు, 14 వ రోజు రూ. 0.35 కోట్లు వసూలు చేసింది. 15 వ రోజు రూ . 27 లక్షలు, 16 వ రోజు 22 లక్షలు వసూలు చేసింది. ఇక క మూవీ 17వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలను పరిశీలిస్తే..కేవలం రూ. 24 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ కలెక్షన్లతో (ఇండియన్ బాక్సాఫీస్ వద్ద) ఇప్పటివరకూ క మూవీ మొత్తం రూ.28.73 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

ఇక 'క'మూవీ డే 17( KA DAY 17) తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 20.91 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. వరుణ్ తేజ 'మట్కా', సూర్య 'కంగువ' లాంటి భారీ బడ్జెట్ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకోవడంతో కాస్త వీకెండ్ లో వసూళ్లు పెరిగే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో క మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోవడం చూస్తే.. క మూవీ కలెక్షన్లు ముగిసినట్టే అనిపిస్తోంది. కానీ, థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన క మూవీ ఘన విజయాన్ని అందుకుంది. కిరణ్ అబ్బవరం క మూవీ దీపావళి బాక్సాఫీస్ రేసులో విన్నర్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











