KA Movie Day 18 Box Office: క మూవీ 18 డేస్ టోటల్ కలెక్షన్స్ ఇవే..ఎన్ని కోట్లు వచ్చాయంటే?

KA Movie Day 18 Box Office: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లెటేస్ట్ మూవీ క(KA movie). సస్పెన్స్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీరామ్ లు హీరోయిన్స్ గా నటించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించగా.. దర్శక ద్వయం సుజీత్, సందీప్ "క" సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన క మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మరీ ఇప్పటి వరకూ క మూవీ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది? 18 వ రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..

శివ కార్తీకేయన్ 'అమరన్', దుల్కర్ సల్మాన్ 'లక్కీ బాస్కర్' వంటి భారీ బడ్జెట్ సినిమాలతో పోటీ పడి.. కిరణ్ అబ్బవరం క మూవీ ఘన విజయాన్ని అందుకుంది. కిరణ్ కు గుడ్ కమ్ బ్యాక్ మూవీగా 'క' మారింది. గత వారం విడుదలైన వరుణ్ తేజ 'మట్కా', సూర్య 'కంగువ'ల నుంచి గట్టి పోటీ ఎదుర్కుంటుంది. ఈ పరిస్థితుల్లో క మూవీ కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది ఆసక్తికరంగా మారింది.

Kiran Abbavaram KA Movie Day 18 Box Office Collection Worldwide

ఇక 'క'మూవీ (ఇండియన్ బాక్సాఫీస్) కలెక్షన్లు వివరాల్లోకెళ్తే.. క మూవీ తొలి రోజు రూ.3.8 కోట్లు వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తరువాత రెండవ రోజు రూ.3 కోట్లు, 3వ రోజు రూ. 3.75 కోట్లు, ఇక నాలుగో రోజున హైయ్యేస్ట్ గా రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా తొలి వీకెండ్ లో కలెక్షన్స్ లో క మూవీ దుమ్మురేపింది. కానీ, 5వ రోజు నుంచి కలెక్షన్లు కాస్త తగ్గాయి.. 5వ రోజు 1.60 కోట్లు, 6వ రోజు రూ.1.50 కోట్లు, 7వ రోజు రూ.1.2 కోట్లు, 8వ రోజు రూ.0.8 కోట్లు వసూలు చేసింది.

ఇక సెకండ్ వీకెండ్ లో కూడా క మూవీ కలెక్షన్లు మళ్లీ పెరిగాయి. 9వ రోజు రూ.1.02 కోట్లు, 10వ రోజు రూ.1.80 కోట్లు, 11వ రోజు రూ.1.95 కోట్లు, 12వ రోజు రూ. 0.75 కోట్లు, 13వ రోజు రూ.0.55 కోట్లు, 14 వ రోజు రూ.0.35 కోట్లు, 15వ రోజు రూ. 27 లక్షలు, 16వ రోజు 22 లక్షలు, 17 వ రోజు రూ. 24 లక్షలు వసూలు చేసింది.

Kiran Abbavaram KA Movie Day 18 Box Office Collection Worldwide

ఇక క మూవీ 18వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలను పరిశీలిస్తే..కేవలం రూ. 35 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ కలెక్షన్లతో (ఇండియన్ బాక్సాఫీస్ వద్ద) ఇప్పటివరకూ క మూవీ మొత్తం రూ.29.27 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.50 కోట్లు అందుకున్నట్టు తెలుస్తోంది.

గత వారం వరుణ్ తేజ 'మట్కా', సూర్య 'కంగువ' లాంటి భారీ బడ్జెట్ మూవీ విడుదలైనా అవి.. బీలో యావరేజ్, యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో క మూవీకి వీకెండ్ లో కాస్త వసూళ్లు పెరిగాయి. థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన క మూవీ దీపావళి రేసులో నిలిచి ఘన విజయాన్ని అందుకుంది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది.

More from Filmibeat

Read more about: ka ka box office kiran abbavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X