KA Day 3 Box Office: కుమ్మిపడేస్తోన్న కిరణ్ అబ్బవరం.. క మూవీ మూడవ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
KA Day 3 Box Office: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క (KA). ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన మూవీకి సుజీత్, సందీప్ లు దర్శకత్వం వహించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన 'క' సినిమా ఎన్ని కోట్ల వసూల్లు రాబట్టింది? మూడవ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..
ఎన్నో రోజుల నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)కు క మూవీ ద్వారా బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. వరుస ఫ్లాప్స్ తో బాధపడ్డ హీరోకు దీపావళీ పండుగ కానుకగా విడుదలైన క (KA) మూవీ మంచి కమ్ బ్యాక్ మూవీగా మారింది. ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో.. కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. దీపావళి పండుగ సందర్బంగా విడుదలైన ఇతర సినిమాలతో పోల్చితే.. క మూవీ షోల సంఖ్య, ప్రీ బుకింగ్స్ కూడా చాలా తక్కువే. కానీ, తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావడం, మౌత్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వస్తున్నాయి.

క మూవీ తొలి రోజు ఇండియన్ బ్యాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల కలెక్ట్ చేయగా.. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ ల్లో అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. ఇలా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు మేకర్స్. అలాగే రెండో రోజు కూడా క మూవీ కలెక్షన్లలో హవా కొనసాగించింది. రెండో రోజు ఇండియన్ బ్యాక్సాఫీస్ రూ.3 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరల్ గా రూ. 6.19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వరల్డ్ వైడ్‌గా సాధించినట్లు తెలుస్తోంది. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయి. ఇక క సినిమా 2 రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
హీరో కిరణ్ అబ్బవరం క సినిమాతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. క మూవీ మూడవ రోజు కలెక్షన్స్ కూడా దుమ్మురేపాయి. శనివారం కూడా క మూవీ హవా కొనసాగింది. ఇక థియేటర్ ఆక్యుపెన్సీ కూడా రోజు రోజుకు పెరుగుతోంది. సక్ నిల్క్ అంచనాల ప్రకారం.. ఇక క మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడవ రోజున అంటే నవంబర్ 2 న 66.72 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. వాటిలో ఉదయం షోలు 43.95 శాతం, మధ్యాహ్నానికి 65.95 శాతం, ఫస్ట్ షోలకు 70.38 శాతం, ఇక నైట్ షోలకు 86.58 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చింది.

ఇక క మూవీకి 3వ రోజు కూడా కలెక్షన్ విషయానికి వస్తే.. క మూవీ శనివారం నాడు వెరీ హ్యూజ్ కలెక్షన్స్ సాధించనుంది. ఎవరూ ఊహించని రేంజులో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. నిజంగా కిరణ్ అబ్బవరం లైఫ్ లో ఎప్పుడు చూడని రికార్డ్ ను అనే చెప్పాలి. కిరణ్ అబ్బవరం కు ఇది మామూలు విషయం కాదు. డే 1 కంటె డే 3 ఎక్కువ కలెక్షన్ల కలెక్ట్ చేసి.. కిరణ్ రికార్డులను బ్రేక్ చేశాయి. ఇలా కిరణ్ అబ్బవరం క సినిమా మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 10.55 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా క మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే.. క మూవీ 18 నుంచి 20 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఊహించని విధంగా అడ్వాన్స్ బుక్సింగ్, వరుసగా హలీడేస్ రావడంతో మూవీ కలెక్షన్లు మరింత పెరుగుతాయని ట్రెడర్స్ అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం స్క్రీన్స్ సంఖ్య పెంచినట్లు తెలుస్తుంది. ఈ జోష్ చూస్తే.. ఆదివారం కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆదివారం కూడా ఇదే రేంజ్ కలెక్షన్స్ వస్తే.. నాలుగు రోజుల్లోనే 30 కోట్లు మార్క్ దాటే అవకాశముంది. ఇదే జోరు ఈ వారం మొత్తం కొనసాగితే.. ఈజీగా వంద కోట్ల మార్క్ కూడా క్రాస్ చేసే అవకాశాలు లేకపోలేదు. మరి ఎంత రాబడుతుందో చూడాలి..


Click it and Unblock the Notifications











