KA Day 4 Box Office: బాక్సాఫీస్ వద్ద కిరణ్​ జాతర..నాలుగో రోజే హయ్యెస్ట్..క మూవీ కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

KA Day 4 Box Office: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్​లో నటించిన పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ క (KA). ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కిన మూవీకి సుజీత్, సందీప్ లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన 'క' సినిమా మొత్తం ఎన్ని కోట్ల వసూల్లు రాబట్టింది? నాలుగో రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

వరుస ఫ్లాప్స్ తో బాధపడ్డ హీరో కిరణ్ అబ్బవరంకు దీపావళీ సందర్భంగా విడుదలైన క (KA) మూవీ మంచి కమ్ బ్యాక్ మూవీగా మారింది. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరోకు క మూవీ భారీ విజయాన్ని అందించింది. డే వన్ నుంచి బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటున్న క మూవీ రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. దీపావళి పండుగ సందర్బంగా విడుదలైన ఇతర సినిమాలతో పోల్చితే.. క మూవీ షోల సంఖ్య చాలా తక్కువ. కానీ, పాజిటివ్ టాక్ రావడం, మౌత్ టాక్ కూడా కలిసిరావడంతో థియేటర్ల సంఖ్య పెంచారు. దీంతో కలెక్షన్స్ కూడా.. భారీ మొత్తంలో పెరిగాయి.

Kiran Abbavaram KA Movie Day 4 Box Office Collection Worldwide

'క' మూవీ తొలి రోజు ఇండియన్ బ్యాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల కలెక్ట్ చేయగా.. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టడంతో మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అలాగే రెండో రోజు క మూవీ కలెక్షన్స్ హావా కొనసాగింది. రెండో రోజు ఇండియన్ బ్యాక్సాఫీస్ రూ.3 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరల్ గా రూ. 6.19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వరల్డ్ వైడ్‌గా సాధించినట్లు సమాచారం. వీకెండ్ కావడంతో 'క' మూవీ 3వ రోజు కలెక్షన్ పెరుగుదల కనిపించింది. ఎవరూ ఊహించని రేంజ్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.75 కోట్లు కలెక్ట్ చేసి.. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది 'క'.

ఇక నాలుగో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. మూవీ డే 1 నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది . డే 1 తో పోల్చితే.. డే 2 అధిక వసూళ్లు రాబడితే.. డే 2 తో పోల్చితే డే 3 వసూళ్లు హయ్యెస్ట్ వసూళ్లు రాబట్టింది. ఇక క మూవీ డే 4 కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. క మూవీ ఆదివారం నాడు అత్యధిక కలెక్షన్స్ సాధించింది. వీకెండ్ రావడంతో దాదాపు అన్ని థియేటర్లు హౌస్ పుల్ అయ్యాయి. క మూవీ ఆదివారం రూ.3.75 కోట్లు నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల తెలిపాయి. వర్డల్ వైడ్ 23 నుంచి 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ లెక్కలను బట్టి.. తొలి కలెక్షన్ల కంటే.. నాలుగో రోజు కలెక్షన్లే అత్యధికం.

Kiran Abbavaram KA Movie Day 4 Box Office Collection Worldwide

ఇక థియేటర్ ఆక్యుపెన్సీ కూడా రోజు రోజుకు పెరుగుతోంది. సక్ నిల్క్ అంచనాల ప్రకారం.. ఇక క మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగవ రోజున అంటే నవంబర్ 3 న ఆదివారం నాడు మొత్తం 71.83 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. వాటిలో ఉదయం షోలు 47.82 శాతం, మధ్యాహ్నానికి76.63 శాతం, ఫస్ట్ షోలకు84.28 శాతం, ఇక నైట్ షోలకు 78.58 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చింది. ఇక వీకెండ్​లో కలెక్షన్స్ మరింత పెరిగాయి. దాదాపు 75 శాతం ఆక్యుపెన్సీతో షోలు నడుస్తున్నాయి. ఇదే జోరు ఈ వారం మొత్తం కొనసాగితే.. 50 కోట్ల మార్క్ ఈజీగా క్రాస్ చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: ka ka box office kiran abbavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X