KA Day 5 Box Office: బాక్సాఫీస్ వద్ద కిరణ్​ అబ్బవరం మూవీ రచ్చ.. క మూవీ ఐదవ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

KA Day 5 Box Office: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథనాయకుడుగా నటించిన సినిమా క (KA). సస్పెన్స్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్‌గా నటించారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ లు సంయుక్తంగా ఈ మూవీని విలేజ్ బ్యాక్ డ్రాప్ లోని యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన 'క' సినిమా తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అయితే.. ఇప్పటి వరకూ 'క' మూవీ మొత్తం ఎన్ని కోట్ల వసూల్లు రాబట్టింది? ఐదో రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనే వివరాల్లోకి వెళితే..

కిరణ్ అబ్బవరం తన కెరీర్ లో వరుస ఫ్లాప్స్ తో బాధపడుతున్నారు. దీపావళీ సందర్భంగా విడుదలైన క (KA) మూవీ మంచి కమ్ బ్యాక్ మూవీగా మారింది. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరోకు క మూవీ కిరణ్ కెరీర్ లో భారీ విజయాన్ని అందించింది. డే వన్ నుంచి బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంటున్న క మూవీ రోజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటు పోతుంది. దీపావళికి విడుదలైన ఇతర సినిమాలతో పోల్చితే.. క మూవీ షోల సంఖ్య చాలా తక్కువే.. అయినా.. పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ల సంఖ్య పెంచారు. దీంతో కలెక్షన్స్ కూడా భారీ మొత్తంలో పెరిగాయి. దాదాపు 500లకు పైగా స్క్రీన్స్ లలో ప్రదర్శించబడుతున్న ఈ మూవీ ఐదు రోజులకు గాను ఎన్ని కోట్లు వసూల్ చేసిందంటే..

Kiran Abbavaram KA Movie Day 5 Box Office Collection Worldwide

'క'మూవీ తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల కలెక్ట్ చేయగా, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని మొత్తం రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇలా ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టడంతో మూవీ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక రెండో రోజు రూ.3 కోట్లు కలెక్ట్ చేసింది. అటు పండగ సెలవులు, వీకెండ్ కావడంతో 'క'మూవీ 3వ రోజు కలెక్షన్ అమాంత పెరిగాయి. ఊహించని విధంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే.. నాలుగో రోజు ఆదివారం రూ.3.75 కోట్లు వసూలు చేసింది ఇలా కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది 'క'.

ఇక క మూవీ ఐదో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. క మూవీ డే 1 నుండి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది . డే 1 కంటే 2 రోజు.. 2 రోజు తో పోల్చితే 3 రోజు వసూళ్లు పెరిగాయి. ఇక రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతూ వచ్చాయి. ఇక క మూవీ డే 5 కలెక్షన్స్ ను పరిశీలిస్తే.. కాస్త తగ్గాయనే చెప్పాలి. క మూవీ సోమవారం నాడు రూ. 1.60 కోట్లు నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల తెలిపాయి. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క మూవీ మొత్తం ₹ 15.75 కోట్లు వసూల్లు చేసినట్టు తెలుస్తోంది. అలాగే.. ఇప్పటి వరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా రూ. 30 కోట్ల గ్రాస్ ను అందుకుందని అంచనా.

Kiran Abbavaram KA Movie Day 5 Box Office Collection Worldwide

ఇక థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకెళ్తే.. కూడా రోజు రోజుకు పెరుగుతోంది. సక్ నిల్క్ అంచనాల ప్రకారం.. ఇక క మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదవ రోజున అంటే నవంబర్ 4 న ఆదివారం నాడు మొత్తం 30.78 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. వాటిలో ఉదయం షోలు 20.74 శాతం, మధ్యాహ్నానికి 29.86 శాతం, ఫస్ట్ షోలకు 28.42 శాతం, ఇక నైట్ షోలకు 44.10 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చింది. ఇక వీకెండ్​లో కలెక్షన్స్ పెరిగినా.. ఐదో రోజు ఆక్యుపెన్సీ మాత్రం దారుణం పడిపోయింది. వీకెండ్ తో పోల్చుకుంటే.. దాదాపు 50 శాతం ఆక్యుపెన్సీ పడిపోయింది. అయితే.. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ వరకు 50 కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రెడ్ వర్గాల అంచనా. మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: ka ka box office kiran abbavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X