KA Day6 Box Office: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న కిరణ్ అబ్బవరం మూవీ..క మూవీ ఆరో రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
KA Day 6 Box Office: తెలుగు హీరో కిరణ్ అబ్బవరం కథనాయకుడుగా నటించిన సినిమా క (KA). విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి దర్శక ద్వయం సుజీత్,సందీప్ లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి ప్రొడ్యూస్ చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన 'క' సినిమా తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అయితే.. ఇప్పటి వరకూ 'క' మూవీ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది? ఆరో రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్ లో వరుస వైఫల్యలతో ఇబ్బంది పడుతున్న సమయంతో ఆయనకు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది క మూవీ. దీపావళీ సందర్భంగా విడుదలైన క (KA) మూవీ .. అమరన్, బగీరా, లక్కీ బాస్కర్ వంటి సినిమాలతో పాటు సింఘం ఎగైన్, భూల్ భూలయ్యా 2 వంటి హిందీ సినిమాలతో గట్టిపోటీని ఎదుర్కొంటూ.. భారీ విజయాన్ని అందుకుంది. తొలి షో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. అలాగే.. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. విడుదలైన సమయంలో ఇతర సినిమాలతో పోల్చితే.. క మూవీ షోల సంఖ్య చాలా తక్కువ. కానీ, హిట్ టాక్ రావడంతో థియేటర్ల సంఖ్య పెంచారు. దీంతో వీకెండ్ లో కలెక్షన్స్ కూడా భారీ మొత్తంలో పెరిగాయి. అయితే.. క మూవీ ఆరు రోజులకు గాను ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

కిరణ అబ్బవరం 'క'మూవీ తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల కలెక్ట్ చేసింది. మొదటి రోజు ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని క మూవీ మొత్తం రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు రూ.3 కోట్లు కలెక్ట్ చేయగా.. ఇక వీకెండ్ కావడంతో కుమ్మేసింది. 'క'మూవీ 3వ రోజు కలెక్షన్ భారీగా పెరిగాయి. ఎవరూ ఊహించని విధంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. నాలుగో రోజు కూడా రూ.3.75 కోట్లు వసూలు చేసింది. ఇలా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క మూవీ దుమ్మురేపింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది 'క'.
ఇక ఐదో రోజు నుంచి క బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. క సినిమా 5వ రోజు 1.60 కోట్లు రాబట్టింది. దాదాపు 60 శాతం కలెక్షన్లో డ్రాప్ కనిపించింది. ఇక 'క' మూవీ డే 6 కలెక్షన్లను పరిశీలిస్తే.. క్రమంగా వసూలు తగ్గుతున్నాయి. క మూవీ మంగళవారం నాడు రూ. 1.50 కోట్లు నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల తెలిపాయి. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క మూవీ మొత్తం రూ. 17.15 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే.. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 35 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

ఇక థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకెళ్తే.. సక్ నిల్క్ అంచనాల ప్రకారం.. ఇక క మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆరోవ రోజున అంటే నవంబర్ 5 న మంగళవారం నాడు మొత్తం 31.87 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. వాటిలో ఉదయం షోలు 18.90 శాతం, మధ్యాహ్నానికి 32.85 శాతం, ఫస్ట్ షోలకు 32. 42 శాతం, ఇక నైట్ షోలకు 43.32 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ వచ్చింది. ఇక వీకెండ్లో ఆక్యుపెన్సీ పెరిగినా.. ఐదు, ఆరు రోజుల్లో ఆక్యుపెన్సీ పడిపోయిందనే చెప్పాలి. వీకెండ్ తో పోల్చుకుంటే.. నార్మల్ డేస్ లో దాదాపు 40 శాతం ఆక్యుపెన్సీ పడిపోయింది. అయితే..'క' మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ వరకు రూ. 50 కోట్ల మార్క్ ను ఈజీగా క్రాస్ చేస్తుందని ట్రెడ్ వర్గాల అంచనా. మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











