KA Day 7 Box Office: పడిపోతున్న కిరణ్ అబ్బవరం మూవీ వసూలు.. క మూవీ ఏడో రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
KA Movie Day 7 Box Office: తెలుగు హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా క (KA). విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ త్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి దర్శక ద్వయం సుజీత్,సందీప్ లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. దీపావళి సందర్బంగా అక్టోబర్ 31న విడుదలైన 'క' సినిమా తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అయితే.. ఇప్పటివరకూ 'క' మూవీ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది? ఏడో రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
తెలుగు హీరో కిరణ్ అబ్బవరం తన సినీ కెరీర్ లో వరుస వైఫల్యలతో ఇబ్బంది పడుతున్న సమయంతో క మూవీ ఆయనకు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. దీపావళీ సందర్భంగా విడుదలైన క (KA) మూవీ .. అమరన్, బగీరా, లక్కీ బాస్కర్ వంటి సినిమాలతో పాటు సింఘం ఎగైన్, భూల్ భూలయ్యా 2 వంటి హిందీ సినిమాలతో గట్టిపోటీని ఎదుర్కుంటుంది. అయినా ఈ సినిమాల నుంచి పోటీని తట్టుకుంటూనే భారీ విజయాన్ని అందుకుంది. తొలి షో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. అలాగే.. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. వీకెండ్ లో కలెక్షన్స్ కూడా భారీ మొత్తంలో పెరిగాయి. అయితే.. నార్మల్ డేస్ లో కలెక్షన్లు తగ్గుతున్నాయి. ఈ తరుణంలో క మూవీ ఏడు రోజులకు గాను ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

కిరణ అబ్బవరం 'క'మూవీ తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని క మూవీ మొదటి రోజు మొత్తం రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు రూ. 3 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వీకెండ్ లో క మూవీ కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. 3వ రోజు కలెక్షన్ భారీగా పెరిగాయి. ఎవరూ ఊహించని విధంగా రూ. 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు అత్యధికంగా రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా వీకెండ్ లో క మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది 'క'.
ఇక ఐదో రోజు నుంచి క మూవీ కలెక్షన్ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. క సినిమా 5వ రోజు 1.60 కోట్లు రాబట్టగా.. ఆరోవ రోజు మంగళవారం నాడు రూ.1.50 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఏడో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1.2 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల తెలిపాయి. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క మూవీ మొత్తం రూ. 18.05 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. అలాగే.. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.36 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

ఇక 'క'మూవీ థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకెళ్తే.. సక్ నిల్క్ అంచనాల ప్రకారం.. ఇక క మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఏడవ రోజున అంటే నవంబర్ 6న బుధవారం నాడు ఉదయం షోలు 17.16 శాతం, మధ్యాహ్నానికి 21.73 శాతం, ఫస్ట్ షోలకు 21. 42 శాతం, ఇక నైట్ షోలకు 29.61 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇలా మొత్తం 22.48 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. ఇక వీకెండ్లో ఆక్యుపెన్సీ పెరిగినా..నార్మల్ డేస్ లో అంటే..సోమ, మంగళ, బుధ వారాల్లో ఆక్యుపెన్సీ క్రమంగా పడిపోతుందని చెప్పాలి. వీకెండ్ తో పోల్చుకుంటే నార్మల్ డేస్ ఆక్యుపెన్సీ దాదాపు 60 శాతం పడిపోయింది. అయితే 'క'మూవీకి పాజిటివ్ టాక్ అందుకోవడంతో సెకండ్ వీకెండ్ లో కలెక్షన్లు పుంజుకునే అవకాశమున్నట్టు ట్రెడ్ వర్గాల అంచనా.


Click it and Unblock the Notifications











