KA Movie Day 8 Box Office: తగ్గుతున్న కిరణ్ అబ్బవరం మూవీ వసూళ్లు.. క మూవీ ఎనిమిదో రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే

KA Movie Day 8 Box Office: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లెటేస్ట్ సినిమా క (KA). సస్పెన్స్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్ నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ త్రిల్లర్ గా క మూవీని దర్శక ద్వయం సుజీత్, సందీప్ లు సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ మూవీని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. దీపావళి సందర్బంగా అక్టోబర్ 31న విడుదలైన 'క' సినిమా తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అయితే.. ఇప్పటి వరకూ 'క' మూవీ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది? ఎనిమిదో రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..

దీపావళీ సందర్భంగా విడుదలైన క (KA) మూవీ .. అమరన్, బగీరా​​, లక్కీ బాస్కర్, సింఘం ఎగైన్, భూల్ భూలయ్యా 2 వంటి వంటి సినిమాలను గట్టిపోటీని ఎదుర్కుంటుంది. భారీ బడ్జెట్ సినిమాల నుంచి పోటీని తట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు హీరో కిరణ్ అబ్బవరం తన సినీ కెరీర్ లో వరుస వైఫల్యలతో ఇబ్బంది పడుతున్న సమయంతో క మూవీ ఆయనకు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. క మూవీ తొలి షో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. అలాగే.. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.వీకెండ్ లో భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ, నార్మల్ డేస్ లో కలెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ తరుణంలో క మూవీ ఎనిమిది రోజులకు గాను ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

Kiran Abbavaram KA Movie Day 8 Box Office Collection Worldwide

కిరణ్ అబ్బవరం 'క'మూవీ తొలిరోజు ఇండియన్ బాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల వసూలు చేయగా.. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని మొత్తం రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇక 2 వ రోజు రూ.3 కోట్లు, ఇక 3వ రోజు రూ. 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు అత్యధికంగా రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి వీకెండ్ లో క మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది 'క'.

కానీ.. ఐదో రోజు నుంచి క మూవీ కలెక్షన్ వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. క సినిమా 5వ రోజు 1.60 కోట్లు రాబట్టగా.. ఆరోవ రోజు మంగళవారం నాడు రూ.1.50 కోట్లు వసూలు చేసింది. ఇక ఏడో రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1.2 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇక ఎనమిదో రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 0.9 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల తెలిపాయి. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద క మూవీ మొత్తం రూ. 19.05 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. అలాగే.. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.37 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

Kiran Abbavaram KA Movie Day 8 Box Office Collection Worldwide

ఇక 'క'మూవీ థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకెళ్తే.. సక్ నిల్క్ అంచనాల ప్రకారం.. ఇక క మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది రోజున అంటే నవంబర్ 7 న గురువారం నాడు ఉదయం షోలు 14.74 శాతం, మధ్యాహ్నానికి 21.68 శాతం, ఫస్ట్ షోలకు 19.83 శాతం, ఇక నైట్ షోలకు 28.88 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇలా డే 8 నాడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 21.28 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది. తొలి వీకెండ్​లో ఆక్యుపెన్సీ పెరిగినా..నార్మల్ డేస్ లో మాత్రం అటు కలెక్షన్లు, ఆక్యుపెన్సీ క్రమంగా పడిపోతుందని చెప్పాలి. వీకెండ్ తో కంటే నార్మల్ డేస్ లో దాదాపు 60 నుంచి 65 శాతం ఆక్యుపెన్సీ పడిపోయింది. అయితే 'క' సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి.. సెకండ్ వీకెండ్ లో కలెక్షన్లు పుంజుకునే అవకాశమున్నట్టు ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: ka ka box office kiran abbavaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X