KA Day9 Box Office: మళ్లీ పుంజుకుంటున్న కిరణ్ మూవీ వసూళ్లు..క మూవీ తొమ్మిదో రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
KA Movie Day 8 Box Office: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథనాయకుడిగా నటించిన లెటేస్ట్ సినిమా క (KA). సస్పెన్స్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ లు హీరోయిన్స్ గా నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సస్పెన్స్ త్రిల్లర్ మూవీకి దర్శక ద్వయం సుజీత్,సందీప్ లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఈ మూవీని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోపాల కృష్ణ రెడ్డి నిర్మించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన 'క' సినిమా తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. అలాంటి క మూవీ ఇప్పటి వరకూ మొత్తం ఎన్ని కోట్ల వసూలు చేసింది? తొమ్మిదో రోజు ఎన్ని కోట్లు రాబట్టింది? అనే వివరాల్లోకి వెళితే..
దీపావళీ సందర్భంగా విడుదలైన క (KA) మూవీ .. అమరన్, బగీరా, లక్కీ బాస్కర్, సింఘం ఎగైన్, భూల్ భూలయ్యా 2 వంటి భారీ బడ్జెట్ సినిమాల నుంచి గట్టిపోటీని ఎదుర్కుంటుంది. అయినా.. ఆ పోటీని తట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. వరుస వైఫల్యలతో ఇబ్బంది పడుతున్న హీరో కిరణ్ అబ్బవరంకు 'క' మూవీ మంచి కమ్ బ్యాక్ మూవీగా మారింది. క మూవీ తొలి షో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. అలాగే.. రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. తొలి వీకెండ్ లో భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ, నార్మల్ డేస్ లో కలెక్షన్లు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ తరుణంలో క మూవీ తొమ్మిది రోజులకు గాను ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

కిరణ్ అబ్బవరం 'క'మూవీ తొలిరోజే పాజిటివ్ టాక్ అందుకోవడంతో కలెక్షన్లు ఓ రేంజ్ లో వచ్చాయి. దీంతో క మూవీ డే 1 రూ. 3.8 కోట్ల వసూలు ( ఇండియన్ బాక్సాఫీస్) చేయగా.. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుని మొత్తం రూ.6.18 కోట్లు వసూలు చేసింది. ఇక రెండవ రోజు రూ.3 కోట్లు వసూలు చేసింది. ఇక 3 వ రోజు రూ. 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు అత్యధికంగా రూ.3.75 కోట్లు కలెక్ట్ చేసి.. కిరణ్ అబ్బవరం కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలించింది 'క'. మొత్తానికి మొదటి వీకెండ్ లో క మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. భారీ మొత్తంలో వసూళ్లను రాబట్టింది.
కానీ, ఐదో రోజు నుంచి క మూవీ కలెక్షన్ వసూళ్లు క్రమంగా పడిపోయాయి. క సినిమా 5 వ రోజు 1.60 కోట్లు కలెక్ట్ చేయగా.. ఆరోవ రోజు రూ. 1.50 కోట్లు, ఏడో రోజు రూ. 1.2 కోట్లు, ఎనిమిదో రోజు రూ. 0.8 కోట్లు రాబట్టింది. వరుసగా కలెక్షన్లు తగ్గినా.. తొమ్మిదో రోజు వసూళ్లలో కాస్త పెరుగుదల కనిపించింది. వీకెండ్ లో కలెక్షన్లు పెరుగుతాయని అనిపిస్తోంది. ఇక తొమ్మిదో రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివరాల్లోకెళ్తే.. క మూవీ బాక్సాఫీస్ వద్ద 1.02 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల తెలిపాయి. ఈ కలెక్షన్లతో క మూవీ ఇప్పటివరకూ మొత్తం రూ. 19.95 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.37 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు తెలుస్తోంది.

ఇక 'క'మూవీ డే 9 థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకెళ్తే.. సక్ నిల్క్ అంచనాల ప్రకారం.. ఇక క మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదో రోజున అంటే నవంబర్ 8 తేదీ శుక్రవారం నాడు.. ఉదయం షోలు 15.59 శాతం, మధ్యాహ్నానికి 18.06 శాతం, ఫస్ట్ షోలకు 22.12 శాతం, ఇక నైట్ షోలకు 29. 52 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇలా డే 9 నాడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 21.32 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.
వీకెండ్ లో ఆక్యుపెన్సీ పెరిగినా.. నార్మల్ డేస్ లో ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. దాదాపు 65 శాతం ఆక్యుపెన్సీ పడిపోయింది. అయితే కా మూవీ హిట్ టాక్ అందుకోవడంతో సెకండ్ వీకెండ్ లో భారీగానే కలెక్షన్లు అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి వీకెండ్ లో వచ్చిన విధంగా కలెక్షన్లు వస్తే ఈజీగా 50 కోట్ల అక్కును క్రాస్ చేస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











