Meter 2 Days Collections: కిరణ్ మూవీకి మైండ్ బ్లాక్ కలెక్షన్స్.. కెరీర్‌లోనే అలాంటి రికార్డ్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం జోరు మీద ఉన్నాడు. హిట్స్ ప్లాప్స్ అంటూ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఏడాది 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంతో అలరించిన కొద్ది రోజుల్లోనే మీటర్ అనే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 7న శుక్రవారం రోజున మాస్ మసాలా సినిమాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రెండు రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా.

అగ్ర నిర్మాణ సంస్థ: వరుస పెట్టి సినిమాలతో జోరు చూపిస్తున్న కిరణ్ అబ్బవరం తాజాగా మీటర్ అనే మూవీతో వచ్చాడు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించారు. రమేష్ కోడూరి అనే డైరెక్టర్ పరిచయం కాగా అతుల్య రవి హీరోయిన్ గా చేసింది.

Kiran Abbavaram Meter Movie 2 Days Worldwide Box Office Collection

ప్రీ రిలీజ్ బిజినెస్: కిరణ్ అబ్బవరం తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా నటించిన మీటర్ సినిమాకు బడ్జెట్ భారీగానే అయినట్లు తెలుస్తోంది. అనుకున్న దానికంటే మీటర్ మూవీ సుమారు రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్లు సమాచారం. ఇక కిరణ్ మార్కెట్ కు అనుగుణంగానే మీటర్ సినిమాకు రూ. 4.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు అంచనా వేశారు.

థియేటర్స్ వివరాలు: మీటర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ అతుల్య రవి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మీటర్ మూవీని నైజాంలో 90, సీడెడ్ లో 40, ఆంధ్రాలో 150 థియేటర్లలో విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 280 స్క్రీన్స్ కాగా కర్ణాటక, ఓవర్సీస్ కలిపి 180 థియేటర్లతో వరల్డ్ వైడ్ గా 460 థియేటర్లలో రిలీజ్ చేశారు.

Kiran Abbavaram Meter Movie 2 Days Worldwide Box Office Collection

తొలి రోజు కలెక్షన్స్: కిరణ్ అబ్బవరం నటించిన మాస్ కమర్షియల్ మూవీ మీటర్ కు నెగెటివ్ టాక్ వస్తోంది. దీంతో పెద్దగా కలెక్షన్స్ రావట్లేదు. మీటర్ విడుదలైన రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 లక్షల షేర్, రూ. 56 లక్షల గ్రాస్ రాబట్టగలిగింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఇలా మరో రూ. 5 లక్షలు వచ్చినట్లు సమాచారం. ఇలా మొత్తంగా తొలి రోజు రూ. 25 లక్షల షేర్ ను కలెక్ట్ చేసింది మీటర్ మూవీ.

రెండో రోజు వసూళ్లు: కిరణ్ అబ్బవరం మీటర్ మూవీకి రెండో రోజునే పూర్తిగా వాషౌట్ అయిపోయినట్లు టాక్ వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర నైజాంలో డెఫిసిట్ లు నెగెటివ్ షేర్స్ ఏం తీయకుండా రూ. 7 లక్షలకుపైగా గ్రాస్ అందుకున్నట్లు సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 15 లక్షల రేంజ్ లో గ్రాస్ అందుకున్నట్లు అంచనా వేశారు. ఇలా రెండు రోజుల్లో రూ. 71 లక్షల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది.

బిగ్గెస్ట్ ప్లాప్: అయితే కిరణ్ అబ్బవరం మీటర్ సినిమాకు చాలా సెటర్స్ లలో డెసిఫిట్ లు, నెగెటివ్ షేర్స్ లాంటివి పడటంతో అవన్నీ తీసేస్తే ఈ మూవీకి రెండో రోజు దాదాపుగా జీరో షేర్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రూ. 4.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన మీటర్ సినిమా కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ ఫ్లాప్ గా నిలవడం పక్కా అని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X