Meter Pre Release Bussiness: కిరణ్ అబ్బవరం మాస్ సినిమాకు సాలీడ్ బిజినెస్.. ఎంత రావాలంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సమ్మర్ సినిమాల సందడి మొదలయ్యింది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఎక్కువగా డిఫరెంట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా గతంలో కంటే ఎక్కువ స్థాయిలో బిజినెస్ చేసుకుంటున్న హీరోలు ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. ఇక ఈ శుక్రవారం రోజు రావణాసురతో పాటు కమర్షియల్ సినిమా మీటర్ కూడా విడుదల కాబోతోంది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. పూర్తి స్థాయిలో కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. కిరణ్ ఈసారి మాస్ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకోవాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక ఇదివరకే విడుదలైన సాంగ్స్ తో పాటు టీజర్ ట్రైలర్ కూడా పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో ఉండడంతో సినిమాకు మంచి బిజినెస్ అయితే జరిగింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ల సంఖ్య అలాగే ఫ్రీ రిలీజ్ బిజినెస్ బ్రేకింగ్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే.. ఒక విధంగా కిరణ్ రేంజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా మంచి స్థాయిలోనే విడుదలవుతుంది. వరల్డ్ వైడ్ గా మీటర్ సినిమాను 400 పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా నైజంలో 85 థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా సీడెడ్ లో 35, ఆంధ్రప్రదేశ్లో 135గా థియేటర్లలో విడుదల కానుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 250కి పైగా థియేటర్లలో మీటర్ సినిమా బిజినెస్ చేయబోతోంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మీటర్ సినిమాకు 400కు పైగా థియేటర్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కిరణ్ అబ్బవరం రేంజ్ కు తగ్గట్టుగానే మార్కెట్లో మంచి బిజినెస్ అయితే క్రియేట్ చేసుకుంది.
మీటర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రూ.3.50 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇక మిగతా రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్ లో కలుపుకొని దాదాపు 4 కోట్ల రేంజ్ లో సినిమా బిజినెస్ జరిగి ఉంటుంది అని సమాచారం. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 4.50 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి కిరణ్ అబ్బవరం ఈసారి ఆ టార్గెట్ ను తొందరగా ఫినిష్ చేస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











