Nenu Meeku Baaga Kavalsinavaadini: కిరణ్‌ సినిమాకు షాకింగ్ వసూళ్లు.. 2 రోజుల్లో వచ్చింది ఇంతే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కొత్త కొత్త హీరోలు వస్తున్నారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు విజయాన్ని కూడా ఖాతాలో వేసుకుంటోన్నారు. అలాంటి వారిలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. గ్రాండ్ ఎంట్రీని అందుకున్నాడు. అలాగే, గత ఏడాది 'ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో భారీ హిట్‌ను దక్కించుకున్నాడు. దీంతో యూత్‌లో అతడికి క్రేజ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయిందనే చెప్పాలి. ఈ ఉత్సాహంతోనే కిరణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

2022 ఆరంభంలోనే కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది డిజాస్టర్‌గా మిగిపోయింది. ఆ తర్వాత ఈ యంగ్ హీరో 'సమ్మతమే' అనే సినిమాను చేశాడు. దీనికి మంచి టాక్ దక్కినా ప్రేక్షకుల నుంచి స్పందన సరిగా లేకపోవడంతో పరాజయం పాలైంది. ఇలా ఈ సంవత్సరం ఇప్పటికే రెండు ఫ్లాపులను ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అనే సినిమాను చేశాడు. శ్రీధర్ గాదె దర్శకత్వంలో మాస్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రంపై ఆరంభం నుంచే అందరిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

Kiran Abbavaram Nenu Meeku Baaga Kavalsinavaadini Movie 2 Days Box Office Collections

మాస్ కమర్షియల్ జోనర్‌లో వచ్చిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అంచనాలకు అనుగుణంగానే విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు అంతంత మాత్రంగానే ప్రేక్షకుల నుంచి స్పందనను దక్కించుకుంది. దీంతో ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో కలుపుకుని కేవలం రూ. 30 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకుని దీనికి మరో రూ. 10 లక్షలు వసూలు అయ్యాయి. అంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీకి రూ. 40 లక్షలే వచ్చాయి.

కిరణ్ అబ్బవరం నటించిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీ రెండో రోజు అస్సలు తేరుకోలేకపోయింది. ఫలితంగా చాలా అంటే చాలా తక్కువ వసూళ్లనే రాబట్టింది. ఇలా రెండు రోజుల్లో ఈ సినిమా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 55 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇక, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 5 లక్షలతో కలుపుకుంటే మొత్తంగా దీనికి రూ. 63 లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు మేర గ్రాస్ వసూలు అయింది.

'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 5 కోట్ల బిజినెస్ చేసుకోగా.. టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. అంటే ఈ చిత్రానికి ఇంకా రూ. 5 కోట్లు వరకూ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా.. కిరణ్ అబ్బవరం నటించిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాను శ్రీధర్ గాదె తెరకెక్కించారు. ఈ సినిమాలో సంజన ఆనంద్, సోను ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. కోడి రామకృష్ణ సమర్పణలో, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్య దీప్తి నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతాన్ని అందించారు. ఇందులో బాబా భాస్కర్ కీలక పాత్రను చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X