For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nenu Meeku Baaga Kavalsinavaadini: హీరో కిరణ్‌కు షాక్.. ఫస్ట్ డే అన్ని లక్షలే.. రెండోరోజు మాత్రం!

  |

  ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును అందుకున్నారు. అదే సమయంలో భారీ విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అలాంటి యంగ్ హీరోల్లో రాయలసీమ కుర్రాడు కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఇది డీసెంట్ హిట్ కొట్టడంతో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నాడు. అలాగే, గత ఏడాది 'ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

  Sreemukhi Remuneration: శ్రీముఖి రెమ్యూనరేషన్ లీక్.. ఒక్క ఈవెంట్‌కే అన్ని లక్షలు.. యాంకర్ సుమ కంటే!

  ఈ ఏడాది ఆరంభంలోనే కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్' మూవీ చేశాడు. ఇది ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత ఈ యంగ్ హీరో 'సమ్మతమే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మంచి టాక్ వచ్చినా రెస్పాన్స్ లేకపోవడంతో బాక్సాఫీస్ ముందు బోల్తా పడిపోయింది. ఇలా ఈ ఏడాది ఇప్పటికే రెండు పరాజయాలను చవి చూసిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' అనే సినిమాతో వచ్చాడు. శ్రీధర్ గాదె దర్శకత్వంలో మాస్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రంపై ఆరంభం నుంచే అందరిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఇది క్రమంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ వచ్చింది.

   Kiran Abbavaram Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Day 1 Box Office Collections

  పక్కా కమర్షియల్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీ.. ఒక కారు డ్రైవర్ ధనవంతుల కుమార్తెను ప్రేమించడం, ఆమె కోసం వాళ్ల ఇంటికి వెళ్లి ఫైటింగులు చేయడం వంటి అంశాలతో రూపొందిన చిత్రమే 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. అంచనాలకు అనుగుణంగానే విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కంటెంట్ మంచిగానే ఉన్నా.. దాన్ని నడిపించిన తీరు నిరాశజనకంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. దీంతో ఈవినింగ్ షోలకు కూడా ఈ సినిమా తేరుకోలేకపోయింది. ఫలితంగా మొదటి రోజు అంతంత మాత్రంగానే ప్రేక్షకుల నుంచి స్పందనను దక్కించుకుంది.

  దిశా పటానీ ఎద అందాల ప్రదర్శన: వామ్మో ఆమెనిలా చూస్తే నిద్ర పట్టదు!

  ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన కిరణ్ అబ్బవరం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీకి మొదటి రోజు ఊహించిన దానికంటే తక్కువగానే వసూళ్లు వచ్చాయట. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో కలుపుకుని కేవలం రూ. 30 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకుని దీనికి మరో రూ. 10 లక్షలు వసూలు అయ్యాయి. అంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీకి రూ. 40 లక్షల మేర షేర్‌తో పాటు రూ. 80 లక్షల మేర గ్రాస్ వసూలు అయినట్లు తెలుస్తోంది.

  ఇక, రెండో రోజైన శనివారం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మూవీకి రెస్పాన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనిబట్టి దీనికి సెకెండ్ డేన రూ. 50 - 60 లక్షల షేర్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కిరణ్ అబ్బవరం నటించిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమాను శ్రీధర్ గాదె తెరకెక్కించారు. ఈ సినిమాలో సంజన ఆనంద్, సోను ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. కోడి రామకృష్ణ సమర్పణలో, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్య దీప్తి నిర్మించారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతాన్ని అందించారు. ఇందులో బాబా భాస్కర్ కీలక పాత్రను పోషించారు.

  English summary
  Kiran Abbavaram Did a Film Nenu Meeku Baaga Kavalsinavaadini Under Sridhar Gadhe Direction. This Movie Collects Rs 40 Lakh in Day 1.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X