Dilruba Collection Day 1: క ఓపెనింగ్స్ కొట్టలేకపోయిన దిల్‌రూబా.. కిరణ్ అబ్బవరం మూవీకి ఎన్ని కోట్లంటే?
తన టాలెంట్‌తో హీరోగా ఎదిగారు కిరణ్ అబ్బవరం. ప్రేమ కథలు, యూత్‌ఫుట్ ఎంటర్‌టైనర్లతో ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రోటిన్ కథలు కాకుండా కొత్తదనం ఉన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కిరణ్. గతేడాది వచ్చిన క చిత్రంతో కలెక్షన్ల వర్షం కురిపించి.. సరైన బొమ్మపడితే తనను ఎవరూ అడ్డుకోలేరని నిరూపించారు కిరణ్ అబ్బవరం. క సినిమా తర్వాత ఆయన నటించిన చిత్రమే దిల్‌రూబా. మరి ఈ చిత్రం తొలి రోజు ఎలాంటి ఓపెనింగ్స్ రాబట్టింది . ఈ వివరాలు చూస్తే:
దిల్‌రూబా చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన పంజాబీ ముద్దుగుమ్మ రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటించారు. గతేడాది నా సామీ రంగతో పలకరించిన రుక్సార్ దాదాపు ఏడాది తర్వాత దిల్‌రూబాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అలాగే నజియా, సత్య, జాన్ విజయ్, నరైన్, కథి దేవిసన్, క్రాంతి తదితరులు కీలక పాత్రలు పోషించగా.. సామ్ సీఎస్ స్వరాలు సమకూర్చారు. శివమ్ సెల్యూలాయిడ్స్, సారెగమ, ఏ యూడ్లీ ఫిలింస్ పతాకంపై రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమలు సంయుక్తంగా దిల్‌రూబాను నిర్మించాయి. విశ్వకరణ్ దర్శకత్వం వహించారు. హోలి కానుకగా మార్చి 14న దిల్‌రూబా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ ఈవెంట్స్‌తో దిల్‌రూబాకు మంచి స్పందన వచ్చింది. పైగా క సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్ కార్యక్రమాలకు కలిపి ఈ సినిమాకు రూ.17 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. క సినిమాతో కిరణ్ అబ్బవరం మార్కెట్ కూడా పెరగడంతో దిల్‌రూబాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 550 స్క్రీన్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి మొత్తంగా 750 థియేటర్‌లలో దిల్‌రూబాను విడుదల చేశారు.
దిల్‌రూబాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ మేకర్స్, ఆంధ్రాలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే ఏపీలో రూ.5 కోట్లు, నైజాంలో రూ.4 కోట్లు, కర్ణాటకలో రూ.70 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.1.30 కోట్లు చొప్పున ప్రపంచవ్యాప్తంగా రూ.12 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. దిల్‌రూబా లాభాల్లోకి రావాలంటే రూ.13 కోట్ల షేర్, రూ.26 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బ్రేక్ ఈవెన్‌గా నిర్దేశించారు.
క సినిమాతో మంచి ఓపెనింగ్స్ రాబట్టిన కిరణ్ అబ్బవరం .. దిల్‌రూబాకు ఎన్ని కోట్లు రాబట్టాడో చూస్తే : హోలి పండుగను ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఛావా, డిప్లొమాట్, కోర్ట్ వంటి చిత్రాలు ఉన్నప్పటికీ డిఫరెంట్ లవ్ స్టోరీ స్టాంప్ వేయించుకున్న దిల్‌రూబాకు ప్రపంచవ్యాప్తంగా రూ.1.20 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. వీకెండ్‌లో కిరణ్ అబ్బవరం సినిమా సాలీడ్ కలెక్షన్స్ రాబడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











