SR Kalyanamandapam 8Days Collections: రెండో వారంలో పరిస్థితి ఇలా.. ఆ మార్కుతో రికార్డు నమోదు

ఫస్ట్ మూవీతోనే టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'ఎస్ఆర్ కల్యాణమండపం'. శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్రను పోషించారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు ఈ సినిమాను నిర్మించారు. దీనికి హీరో కిరణ్ అబ్బవరం కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందించాడు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. తండ్రి సెంటిమెంట్‌తో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అంతేకాదు, వీటి వల్ల యూత్‌కు చేరువ కావడంతో పాటు ఈ మూవీ పేరు మారుమ్రోగిపోయింది. దీంతో దీనికి బిజినెస్ కూడా ఊహించని రీతిలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 4.55 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. పేరుకు చిన్న సినిమానే అయినా ఈ రేంజ్‌లో వ్యాపారం జరుపుకోవడంపై సినీ విశ్లేషకులే విస్మయం వ్యక్తం చేసేశారు.

Kiran Abbavarams SR Kalyanamandapam Movie Day 8 collections Report

ఎనిమిదో రోజైన శుక్రవారం 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.80 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1.20 లక్షలు, గుంటూరులో రూ. 1.10 లక్షలు, కృష్ణాలో రూ. 1.40 లక్షలు, నెల్లూరులో రూ. 60 వేలు వసూలయ్యాయి. దీంతో మొత్తంగా ఎనిమిదో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 21 లక్షలు షేర్‌ను రాబట్టిందీ చిత్రం. ఫలితంగా ఈ సినిమా ప్రభావాన్ని కొంత మేర తగ్గించుకునట్లు అయింది.

మొదటి ఆట నుంచి సూపర్ రెస్పాన్స్‌ను అందుకుంటోన్న 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ బాక్సాఫీస్‌పై హవాను చూపిస్తూ క్రమంగా ప్రభావాన్ని కోల్పోతుంది. తద్వారా మంచి లాభాలనే అందుకున్నా భారీ నెంబర్ నమోదు చేయలేకపోతుంది. ఇక, ఎనిమిది రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.43 కోట్లు షేర్‌‌ను రాబట్టింది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 38 లక్షలు వసూలు చేసింది. దీంతో మొత్తంగా ఎనిమిది రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.98 కోట్లు షేర్‌‌ను వసూలు చేసి సత్తా చాటిందీ చిత్రం.

'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ ప్రీ రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఏరియాల్లో కలుపుకుని బిజినెస్ రూ. 4.55 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఇక, ఎనిమిది రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 6.98 కోట్లు షేర్ రాబట్టింది. దీంతో ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 2.18 కోట్లు లాభాలను అందుకుని హిట్ చిత్రంగా నిలిచింది. తద్వారా ఈ ఏడాది రెండు కోట్ల రూపాయల లాభాలను అందుకున్న అతి తక్కువ చిత్రాల జాబితాలో చేరిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X