Sammathame 2 days collections: ఊహించని విధంగా పెరిగిన కలెక్షన్స్.. ఇలానే కొనసాగితే హిట్టే!
ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సోలో హీరోగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. అందరి కంటే విభిన్నంగా సినిమాలను ప్రమోట్ చేస్తూ తనదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ హీరో నటించిన సమ్మతమే సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు అంతంతమాత్రంగానే కలెక్షన్స్ అందుకుంది. కానీ రెండవ రోజు మాత్రం ఊహించని విధంగా కలెక్షన్స్ పెంచుకోవడం విశేషం. ఇక రెండవ రోజు ఈ సినిమా ఎలాంటి వసూళ్లను అందుకుంది. హిట్ కావాలి అంటే ఇంకా ఎంత రాబట్టాలి అనే వివరాల్లోకి వెళితే...

మంచి హీరోగా
రాజావారు రాణి వారు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. కేవలం నటుడుగానే కాకుండా రచయితగా కూడా హీరో తన సినిమాలకు సొంతంగా కథలు రాసుకుంటూ వస్తున్నాడు. ఇంతకు ముందు వచ్చిన ఎస్ఆర్.కళ్యాణమండపం కూడా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సమ్మతమైన సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని రెడీ అయ్యాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్
బ్యూటిఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సమ్మతమే సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఇంతకు ముందు కిరణ్ అబ్బవరం సినిమాలు మంచి కలెక్షన్స్ అందుకోవడం వలన ఈ సినిమాకు కొంత బిజినెస్ అయితే జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నాలుగున్నర కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక మొత్తంగా రూ.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా విడుదలైంది.

జనాల్లోకి వెళ్లి
కిరణ్ అబ్బవరం ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లడానికి ప్రమోషన్స్ అయితే బాగానే చేశాడు.
జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లి వారితో కలిసి ఈ సినిమాకి హైప్ ఐతే క్రియేట్ చేశాడు.. కొన్ని రివ్యూలు మాత్రం అంతంతమాత్రంగానే వచ్చినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాకు ఓ వర్గం వారి నుంచి పాజిటివ్ స్పందన లభించింది.

మొదటి రోజు ఎంతంటే?
అయితే మొదటి రోజు పెద్దగా టాక్ రాకపోవడంతో కలెక్షన్స్ కూడా అనుకున్నంతగా ఏమీ రాలేదు. జస్ట్ ఫర్వాలేదనిపించే విధంగా 56 లక్షల షేర్ మాత్రమే అందుకుంది. అయితే పెట్టిన పెట్టుబడికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం అనేది కొంత నిరాశ పరిచే విషయం. కాబట్టి వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ సినిమా వీలైనంత ఎక్కువ కలెక్షన్స్ అందుకుంటేనే లాభాల్లోకి రాగలుగుతుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రెండవ రోజు వచ్చింది ఎంతంటే?
ఇక రెండవ రోజు సమ్మతమే ఎవరు ఊహించని విధంగా మంచి కలెక్షన్స్ అందుకోవడం విశేషం. శనివారం మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగానే ఉన్న కలెక్షన్స్ ఒక్కసారిగా ఈవినింగ్ షోలతో ఊపందుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరగడంతో ఈ సినిమాకు రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 40 లక్షల షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది.. మొత్తం మీద ఈ సినిమా ఓవరాల్ గా రెండు రోజు అయితే 50 లక్షల దాకా షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ పూర్తి లెక్కల పై క్లారిటీ రావాలంటే వీకెండ్ ముగిసే వరకు ఆగాల్సిందే.

ఇంకా ఎంత రావాలంటే?
ఇక పెట్టిన పెట్టుబడికి ఇంకా ఎంత రావాలి అనే వివరాల్లోకి వెళితే.. సమ్మతమే సినిమా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా 1.10 కోట్ల రేంజ్ లో షేర్ కలక్షన్స్ అందుకోవడంతో ఇంకా బాక్సాఫీస్ వద్ద 3.75 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంది. ఆదివారం రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే స్టాండర్డ్ గానే ఉన్నాయి. కాబట్టి కలెక్షన్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. ఇక వీకెండ్ అనంతరం ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











