Sammathame Day 1 Collections: సమ్మతమేకు ఊహించని వసూళ్లు.. మొదటి రోజే ఇలా ఉంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్య కాలంలోనే చాలా మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే మొదటి చిత్రంతోనే విశేషమైన గుర్తింపును అందుకున్నారు. తద్వారా విజయాలను సైతం దక్కించుకున్నారు. అలాంటి వారిలో రాయలసీమ కుర్రాడు కిరణ్ అబ్బవరం ఒకడు. 'రాజావారు రాణిగారు' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఇది డీసెంట్ హిట్ కొట్టడంతో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్నాడు. అలాగే, గత ఏడాది 'ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు. అయితే, ఆ తర్వాత చేసిన 'సెబాస్టియన్' మూవీ మాత్రం అతడిని నిరాశ పరిచింది.

మరోసారి తన సత్తాను నిరూపించడంతో పాటు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న కిరణ్ అబ్బవరం తాజాగా 'సమ్మతమే' అనే సినిమలో నటించాడు. గోపీనాథ్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్యూర్ లవ్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాపై ఆరంభం నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమాను అల్లు అరవింద్ స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన రేంజ్‌కు తగ్గట్లుగానే 'సమ్మతమే' సినిమాను ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా మంచిగానే జరిగినట్లు తెలిసింది.

Kiran Abbavaram Sammathame Movie Day 1 Box Office Collections

పెళ్లి తర్వాత అమ్మాయిలు.. భర్తల అభిరుచి తగినట్లు.. ప్రేమలో పడిన యువతులు తమ ప్రియుడు చెప్పినట్లు మారడం వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్థావిస్తూ 'సమ్మతమే' చిత్రాన్ని రూపొందించారు. అంచనాలకు అనుగుణంగానే విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా కంటెంట్ మంచిగానే ఉన్నా.. దాన్ని నడిపించిన తీరు నిరాశజనకంగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. దీంతో ఈవినింగ్ షోలకు కూడా ఈ సినిమా తేరుకోలేకపోయింది. ఫలితంగా మొదటి రోజు అంతంత మాత్రంగానే ప్రేక్షకుల నుంచి స్పందనను దక్కించుకుంది.

ఇక, ఎన్నో అంచనాలతో విడుదలైన కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' మూవీకి మొదటి రోజు ఊహించిన దానికంటే తక్కువగానే వసూళ్లు వచ్చాయట. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో కలుపుకుని కేవలం రూ. 50 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. అలాగే, రెస్టాఫ్ ఇండియాతో పాటు ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకుని దీనికి మరో రూ. 10 లక్షలు వసూలు అయ్యాయి. అంటే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 'సమ్మతమే' మూవీకి రూ. 60 లక్షల మేర షేర్‌తో పాటు రూ. 1.40 కోట్ల మేర గ్రాస్ వసూలు అయినట్లు తెలుస్తోంది.

'సమ్మతమే' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 4.50 కోట్లు మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఫలితంగా దీనికి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5 కోట్లుగా నమోదైంది. ఇక, దీనికి మొదటి రోజు కేవలం రూ. 60 లక్షలే రావడంతో ఇంకా రూ. 4.40 కోట్లు వెనకబడి ఉంది. ఇదిలా ఉండగా.. 'సమ్మతమే' సినిమాతో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కనకాల ప్రవీణ నిర్మించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X