Meter Day 1 Collections: కిరణ్‌కు బిగ్ షాక్.. తొలి రోజే ఈ రేంజ్ వసూళ్లు.. మైండ్ బ్లాక్ అయ్యేలా!

ప్రస్తుతం తెలుగు వెండితెరపై ఎంతో మంది కుర్ర హీరోలు సత్తా చాటుతూ మంచి గుర్తింపుతో దూసుకుపోతోన్నారు. తద్వారా ప్రేక్షకులను అలరించడంతో పాటు తమ రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం ఒకడు.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ ఏడాది ఇప్పటికే 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రాన్ని చేశాడు. దీనికి భారీ స్పందన రావడంతో హిట్‌ను అందుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'మీటర్' అనే పక్కా కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Kiran Abbavaram Starrer Meter Movie Day 1 Box Office Collections

కిరణ్ అబ్బవరం నటించిన 'మీటర్' మూవీ విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. కానీ, దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీనికితోడు ఇదే రోజు మాస్ మహారాజా రవితేజ నటించిన 'రావణాసుర' కూడా విడుదలైంది.

ఫలితంగా కిరణ్ అబ్బవరం చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన దక్కలేదు. ఈ ప్రభావం మొదటి రోజు కలెక్షన్లపై చూపుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీకి తొలి రోజే దారుణమైన వసూళ్లు దక్కాయి.

టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'మీటర్' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే మొదటి రోజు నైజాం ఏరియాలో రూ. 26 లక్షలు మాత్రమే గ్రాస్ వసూలు అయింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని మరో రూ. 30 లక్షలు గ్రాస్ వచ్చింది.

ఇలా మొదటి రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 56 లక్షలు గ్రాస్‌ను, 20 లక్షలు షేర్‌ను మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మరో 5 లక్షలు వచ్చాయి. అంటే మొత్తంగా ఇది రూ. 25 లక్షలు షేర్‌నే వసూలు చేసింది. ఇక, ఈ చిత్రం రూ. 4.50 కోట్లు షేర్ టార్గెట్‌తో బరిలోకి దిగగా.. ఇంకా రూ. 4.25 లక్షలు వస్తేనే హిట్ అవుతుంది.

ఇదిలా ఉండగా.. కిరణ్ అబ్బవరం - రమేష్ కడూరి రూపొందిన చిత్రమే 'మీటర్'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చెర్రీ, హేమలత పెదమల్లు నిర్మించారు. దీనికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఇందులో ధనుష్ పవన్, పోసాని, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X