Rules Ranjann Closing Collections: 4.50 కోట్ల సినిమా.. కిరణ్ మైండ్ బ్లాక్.. ఏకంగా అన్ని కోట్ల నష్టం
తెలుగు చిత్ర పరిశ్రమంలో ఈ మధ్య కాలంలో ఎంతో మంది యంగ్ అండ్ టాలెంటెడ్ గాయ్స్ హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ అందులో అతి తక్కువ మంది మాత్రమే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో కిరణ్ అబ్బవరం ఒకడు.
ఆరంభంలోనే మంచి విజయాలను అందుకున్న అతడు.. మధ్యలో కాస్త తడబడినా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇటీవలే 'రూల్స్ రంజన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ప్రేక్షకులు షాక్ ఇవ్వడంతో వసూళ్లు రాలేదు. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లను మీరే చూసేయండి మరి!

రూల్స్ రంజన్‌గా వచ్చిన కిరణ్: కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం కృష్ణ తెరకెక్కించిన ఫన్ మూవీనే 'రూల్స్ రంజన్'. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను స్ట్రైట్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో దివ్యాంగ్, వేమూరి మురళీ కృష్ణ నిర్మించారు. ఇందులో మెహర్ చహల్, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, సుబ్బరాజు, వైవా హర్ష వంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు.

కిరణ్ మూవీ బిజినెస్ డీటేల్స్: క్రేజీ కాంబినేషన్‌లో 'రూల్స్ రంజన్' మూవీ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రచారం చిత్రాలు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాయి. ఫలితంగా ఈ మూవీపై అంచనాలు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు మంచి పోటీ ఏర్పడింది. ఫలితంగా దీనికి వరల్డ్ వైడ్‌గా రూ. 4 కోట్లు మేర బిజినెస్ జరిగింది.
అలాంటి టాక్.. వసూళ్లు ఇలా: 'వినరో భాగ్యము విష్ణు కథ'తో మంచి హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్'గా వచ్చాడు. దీనికి మాత్రం ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి స్పందన ఆశించిన రీతిలో రాలేదని చెప్పుకోవాలి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల లోపే చాలా చోట్ల రన్‌ను కూడా ముగించేసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'రూల్స్ రంజన్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ స్పందనే వచ్చింది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో మొదటి రోజు నుంచే నష్టపూరితమైన షోలో పడ్డాయి. ఇలా ఫుల్ రన్‌లో ఈ చిత్రం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1.15 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. అలాగే, రూ. 2.20 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

వరల్డ్ వైడ్‌గా వసూళ్లు ఇలా: కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం కృష్ణ తెరకెక్కించిన 'రూల్స్ రంజన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే చెప్పుకోవాలి. వేరే ప్రాంతాల్లో ఈ చిత్రం వీకెండ్‌కే రన్‌ను క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ. 1.30 కోట్లు షేర్‌ను మాత్రమే రాబట్టింది. అలాగే మొత్తంగా రూ. 2.85 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

మూవీకి టార్గెట్.. నష్టం ఎంత?: ఫన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రూల్స్ రంజన్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 1.30 కోట్లు వచ్చాయి. అంటే దీనికి రూ. 3.20 కోట్లు నష్టాలు మిగిలాయి. ఫలితంగా ఈ చిత్రం డిజాస్టర్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











