VBVK 10 Days Collections: ఒక్కసారిగా కలెక్షన్లు డౌన్.. అయినా అన్ని కోట్లు.. లాభమెంతో తెలిస్తే!

ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోలు పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమదైన టాలెంట్లతో సత్తా చాటి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఒకడు.

ఆరంభంలోనే పలు హిట్లు కొట్టిన అతడు.. ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోన్నాడు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి ఒక్కసారిగా కలెక్షన్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎనిమిది రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

కిరణ్ అబ్బవరం మరో ప్రయోగం

కిరణ్ అబ్బవరం మరో ప్రయోగం

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన క్రేజీ మూవీనే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు

అంచనాలు.. బిజినెస్ వివరాలు

కిరణ్ అబ్బవరంకు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ఏర్పడలేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల అయింది.

10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఆరంభంలో కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కానీ, క్రమంగా అవి డౌన్ అవుతోన్నాయి. అయినా బ్రేక్ ఈవెన్‌ను ఈ చిత్రం పూర్తి చేసింది. ఇక, కిరణ్ సినిమాకు 11వ రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 6 లక్షలు షేర్ వచ్చింది.

10 రోజులకు కలిపి ఎంతొచ్చింది

10 రోజులకు కలిపి ఎంతొచ్చింది

10 రోజుల్లో 'వినరో భాగ్యము విష్ణు కథ'కు వసూళ్లు బానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.16 కోట్లు, సీడెడ్‌లో రూ. 83 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 43 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 32 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో కలిపి.. రూ. 4.56 కోట్లు షేర్, రూ. 8.67 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి 8 రోజుల్లోనే ఏపీ, తెలంగాణలో రూ. 4.56 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 31 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 10 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 5.04 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.85 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంతంటే

టార్గెట్ ఇలా.. లాభం ఎంతంటే

వినూత్నమైన సబ్జెక్టుతో వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 5.04 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ చిత్రానికి రూ. 54 లక్షలు లాభాలు కూడా దక్కాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X