VBVK 11 Days Collections: కలెక్షన్స్ తక్కువే.. కానీ, అన్ని కోట్ల మార్క్ తో క్లీన్ హిట్.. లాభం ఎంతంటే?

టాలెంటెడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హిట్స్ ప్లాప్స్ అంటూ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ఏడాది 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంతో మొదలు పెట్డాడు. అయితే గతేడాది విడుదలైన మూడు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలన్న లక్ష్యంతో 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న విడుదల కాగా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఫలింతగా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఈ క్రమంలో 11 రోజుల వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే..

 అనేక ట్విస్టులతో..

అనేక ట్విస్టులతో..

అనేక ట్విస్టులతో సాగుతూ ఉండే 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలో హీరోగా కిరణ్ అబ్బవరం అలరించాడు. కొత్త డైరెక్టర్ మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ సినిమాలో కాశ్మీరా పరదేశి హీరోయిన్‌గా అలరించింది. ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రీ రిలీజ్ బిజినెస్..

తెలుగు యువ హీరోల్లో ఒకరైన కిరణ్ అబ్బవరానికి తెలుగు రాష్ట్రాల్లో అంత పెద్దగా మార్కెట్ లేదు. కానీ, కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'పై ప్రారంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 4.50 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. అందుకు అనుగుణంగా దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో ఎంతో గ్రాండ్‌గా ఫిబ్రవరి 18న విడుదల చేశారు.

11వ రోజు ఎంతంటే..

11వ రోజు ఎంతంటే..

కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ సినిమాకు వసుళ్లు పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి 11వ రోజు తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్‌, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని రూ. 6 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకుంది. ఫస్ట్ వీక్ బాగా వచ్చిన ఈ వసూళ్లు సెకండ్ వీక్ వర్కింగ్ డేస్ లో తగ్గుముఖం పట్టాయి.

11 రోజుల్లో వచ్చింది..

11 రోజుల్లో వచ్చింది..

కొత్త డైరెక్టర్ మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో న్యూ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మూవీ 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ సినిమాకు 11 రోజుల్లో వసూళ్లు పర్వాలేదనిపిస్తోంది. వీబీవీకే చిత్రానికి 11 రోజుల్లో నైజాంలో రూ. 2.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 85 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 44 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో కలిపి.. రూ. 4.62 కోట్లు షేర్, రూ. 8.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..

వరల్డ్ వైడ్ గా ఎంతంటే..

టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి 11 రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ. 4.62 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 32 లక్షలు కలెక్షన్స్ రాబట్టింది. ఇలా వరల్డ్ వైడ్ గా 11 రోజుల్లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాకు రూ. 5.10 కోట్లు షేర్‌తో పాటు రూ. 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ వసూళు చేసింది. అంటే రెండో వారంలోపు రూ. 10 కోట్ల మార్క్ అందుకుని సత్తా చాటింది.

లాభం ఎంతంటే..

లాభం ఎంతంటే..

ట్విస్టులు, లవ్, రొమాంటిక్ కాన్సెప్టుతో తెరకెక్కిన కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక ఈ చిత్రం 11 రోజుల్లో దీనికి రూ. 5.10 కోట్లు వచ్చాయి. అంటే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు ఈ చిత్రానికి రూ. 60 లక్షలు లాభం కూడా సొంతం చేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X