VBVK 12 Days Collections: మరింత తగ్గిన వసూళ్లు.. లాభం మాత్రం భారీగా.. టోటల్‌గా ఎంతొచ్చిందో తెలిస్తే!

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోలు తెగ సందడి చేస్తోన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. కెరీర్‌ను చక్కగా తీసుకు వెళ్తున్నారు. వారిలో టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం ఒకడు. ఆరంభంలోనే హిట్లను అందుకున్న అతడు.. ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి కలెక్షన్లు క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

విష్ణు కథ అంటూ వచ్చిన కిరణ్

విష్ణు కథ అంటూ వచ్చిన కిరణ్

టాలెంటెడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన క్రేజీ మూవీనే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చాడు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు

అంచనాలు.. బిజినెస్ వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో కిరణ్ అబ్బవరంకు మార్కెట్ పెద్దగా లేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయింది.

12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి ఓపెనింగ్ కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కానీ, క్రమంగా అవి డౌన్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే కిరణ్ నటించిన ఈ సినిమాకు 12వ రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 5 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

12 రోజులకు కలిపి ఎంతొచ్చింది

12 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'వినరో భాగ్యము విష్ణు కథ'కు 12 రోజుల్లో వసూళ్లు బానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.21 కోట్లు, సీడెడ్‌లో రూ. 86 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 33 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, గుంటూరులో రూ. 24 లక్షలు, కృష్ణాలో రూ. 24 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో కలిపి.. రూ. 4.67 కోట్లు షేర్, రూ. 8.95 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి 12 రోజుల్లోనే ఏపీ, తెలంగాణలో రూ. 4.67 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 32 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 12 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 5.15 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.15 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంతంటే

టార్గెట్ ఇలా.. లాభం ఎంతంటే

విభిన్నమైన కథతో రూపొందిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 5.15 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ చిత్రానికి రూ. 65 లక్షలు లాభాలు కూడా దక్కాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X