VBVK 13 Days Collections: కిరణ్ అబ్బవరం లక్.. సినిమాకు ఊహించని లాభం.. మరో 30 లక్షలు వస్తే రికార్డు
సాదాసీదాగానే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్‌తో ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. దీనికితోడు మొదట్లోనే పలు హిట్లు రావడంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తోన్నాడు. కానీ, ఈ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్నాడు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు కిరణ్ 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి కలెక్షన్లు క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ 13 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!

మరో కొత్త ప్రయోగంతో వచ్చాడు
విలక్షణ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా సినిమానే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు
ఆంధ్రా, తెలంగాణలో కిరణ్ అబ్బవరంకు మార్కెట్ పెద్దగా లేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైంది.

13వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా
టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి మార్నింగ్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే దీనికి ఓపెనింగ్ కలెక్షన్లు మంచిగా వచ్చాయి. కానీ, క్రమంగా అవి డౌన్ అవుతోన్నాయి. ఈ క్రమంలోనే కిరణ్ నటించిన ఈ సినిమాకు 13వ రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 6 లక్షలు షేర్ మాత్రమే వసూలు అయింది.

13 రోజులకు కలిపి ఎంతొచ్చింది
13 రోజుల్లో 'వినరో భాగ్యము విష్ణు కథ'కు వసూళ్లు బానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.22 కోట్లు, సీడెడ్‌లో రూ. 87 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 34 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 20 లక్షలు, గుంటూరులో రూ. 25 లక్షలు, కృష్ణాలో రూ. 25 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలతో కలిపి.. రూ. 4.72 కోట్లు షేర్, రూ. 9.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి 13 రోజుల్లోనే ఏపీ, తెలంగాణలో రూ. 4.72 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 33 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 13 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 5.21 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.30 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంతంటే
వినూత్నమైన కథతో వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 13 రోజుల్లో దీనికి రూ. 5.21 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు ఈ చిత్రానికి రూ. 71 లక్షలు లాభాలు కూడా దక్కాయి.


Click it and Unblock the Notifications











