VBVK 1st Week Collections: కిరణ్ మూవీ టార్గెట్ ఫినీష్.. వారంలోనే అన్ని కోట్లు.. అతడి ఖాతాలో మరో హిట్

ఈ మధ్య కాలంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే తమదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో టాలెంటెడ్ గాయ్ కిరణ్ అబ్బవరం ఒకడు.

సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న అతడు తాజాగా 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా మంచి స్పందన వస్తోంది. ఫలితంగా డీసెంట్ కలెక్షన్లు వస్తున్నాయి. మరి ఈ మూవీ వారం రోజుల రిపోర్టు చూసేయండి!

విష్ణు కథ చెప్పాలని వచ్చేశాడు

విష్ణు కథ చెప్పాలని వచ్చేశాడు

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన క్రేజీ మూవీనే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలను చేశారు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు

అంచనాలు.. బిజినెస్ వివరాలు

కిరణ్ అబ్బవరంకు పెద్దగా మార్కెట్ ఏర్పడలేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లే ఇది తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల అయిపోయింది.

7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి 7వ రోజు తెలుగులో వసూళ్లు తగ్గలేదు. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 2 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 1 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్షలు, కృష్ణాలో రూ. 1 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి.. రూ. 21 లక్షలు షేర్, రూ. 42 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

వారానికి కలిపి ఎంతొచ్చింది

వారానికి కలిపి ఎంతొచ్చింది

వారం రోజుల్లో 'వినరో భాగ్యము విష్ణు కథ'కు వసూళ్లు బానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.95 కోట్లు, సీడెడ్‌లో రూ. 70 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 36 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 27 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి.. రూ. 3.98 కోట్లు షేర్, రూ. 7.52 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి ఏపీ, తెలంగాణలో వారం రోజుల్లోనే రూ. 3.98 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 17 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 29 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 7 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 4.44 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.60 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే

క్రేజీ ఐడియాతో రూపొందిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 4.44 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6 లక్షలు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను అందుకుంటుంది.

అన్ని కోట్ల టార్గెట్ ఫినీస్ అని

అన్ని కోట్ల టార్గెట్ ఫినీస్ అని

టాలెంటెడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ'కు మొదట్లోనే భారీ రెస్పాన్స్ దక్కింది. కానీ, క్రమంగా ఈ సినిమాకు కలెక్షన్లు డౌన్ అవుతున్నాయి. అయినప్పటికీ ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతుంది. ఇక, ఈ చిత్రం దాదాపుగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసేసి హిట్‌గా నిలిచింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X