VBVK 2 Days Collections: సండే ఊహించని కలెక్షన్లు.. 2 రోజుల్లోనే అన్ని కోట్లు.. హిట్ కావాలంటే మాత్రం!

విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. 'ఎస్ఆర్ కల్యాణమండపం'తో కెరీర్‌లోనే భారీ హిట్ కొట్టిన అతడు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కిరణ్ 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్‌తో సంబంధం లేకుండా భారీ స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!

విష్ణు కథ అంటూ వచ్చిన కిరణ్

విష్ణు కథ అంటూ వచ్చిన కిరణ్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రమే 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిశోర్ అబ్బూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశ్మీర పరదేశీ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. దీనికి చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు.

అంచనాలు.. బిజినెస్ వివరాలు

అంచనాలు.. బిజినెస్ వివరాలు

కిరణ్ అబ్బవరంకు తెలుగు రాష్ట్రాల్లో అసలు మార్కెట్ లేదు. కానీ, అతడు నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగా దీన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని ఏరియాల్లో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇలా

'వినరో భాగ్యము విష్ణు కథ'కు తెలుగులో 2వ రోజూ మంచి రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 58 లక్షలు, సీడెడ్‌లో రూ. 24 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 9 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి.. రూ. 1.21 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది

2 రోజులకు కలిపి ఎంతొచ్చింది

'వినరో భాగ్యము విష్ణు కథ'కు 2 రోజుల్లో భారీగానే వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 1.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 47 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 22 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 19 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి.. రూ. 2.56 కోట్లు షేర్, రూ. 4.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీకి 2 రోజుల్లో రూ. 2.56 కోట్లు వచ్చాయి. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 11 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 14 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 2.81 కోట్లు షేర్‌తో పాటు రూ. 5.15 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే

టార్గెట్ ఇలా.. ఎంత రావాలంటే

విభిన్నమైన కాన్సెప్టుతో వచ్చిన 'వినరో భాగ్యము విష్ణు కథ' అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.50 కోట్లుగా నమోదైంది. ఇక, 2 రోజుల్లో దీనికి రూ. 2.81 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.69 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను చేరుతుంది.

 వీకెండ్‌లో రికార్డు స్థాయిలోనే

వీకెండ్‌లో రికార్డు స్థాయిలోనే

కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నా విజయాలను అందుకోలేకపోతోన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతడు చేసిన 'వినరో భాగ్యము విష్ణు కథ'కు మాత్రం భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ చిత్రానికి ఏకంగా రూ. 2.81 కోట్లు షేర్ వసూలు అయింది. ఇది ఈ యంగ్ హీరో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ వీకెండ్ అని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X